బీరు, బిర్యానీ అంటూ సిద్ధార్థ్‌ పరువు తీసిన సింగర్‌ ?

Veldandi Saikiran
ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అల్లు అర్జున్ తాజాగా నటించిన సినిమా పుష్ప 2. ఈ సినిమా డిసెంబర్ 4వ తేదీ రాత్రి రిలీజ్ అయింది. డిసెంబర్ 4వ తేదీన రిలీజ్ అయిన పుష్ప పార్ట్ 2...1000 కోట్లకు పైగా ఆరు రోజుల్లోనే కలెక్షన్స్ రాబట్టింది. మరో వారం రోజుల్లోనే 2000 కోట్లు కూడా వసూలు రాబట్టే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసిన పుష్ప 2 గురించే... మాట్లాడుకుంటున్నారు అలాగే చర్చించుకుంటున్నారు.
 
ఈ పుష్ప 2 సక్సెస్ అయిన నేపథ్యంలో కొంతమంది నెగటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఎర్రచందనం దొంగ అంటూ అల్లు అర్జున్ పై రాజేంద్ర ప్రసాద్ లాంటి నటులు కామెంట్ చేయడం మనం చూసాం. ఇక అల్లు అర్జున్ పైన సిద్ధార్థ.. కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీహార్లో పుష్ప 2 ఈవెంట్ సక్సెస్ కావడంపై ఓ యాంకర్ అడిగిన ప్రశ్నకు...సిద్ధార్థ హాట్ కామెంట్స్ చేశారు. వచ్చేసి జెసిబి ఊళ్లో తిరిగితే జనాలందరూ ఒకే దగ్గరికి వస్తారు.
 
అలాగే రాజకీయ పార్టీ నేత మీటింగ్ పెడితే బీరు బిర్యానీకి ఆశపడి జనాలు గుమ్మిగూడుతారు. ఈ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 కోసం అలాగే జనాలు గుమ్మిగూడారని హాట్ కామెంట్స్ చేశారు హీరో సిద్ధార్థ్. అయితే హీరో సిద్ధార్థ చేసిన కామెంట్స్ కు సింగర్.. మికా సింగ్ కౌంటర్ ఇచ్చారు. సిద్ధార్థ చేసిన కామెంట్లు...చాలా దారుణంగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు.

ఆలోచించి అలాంటి వ్యాఖ్యలు చేయాలని కౌంటర్ ఇచ్చారు. బీరు బిర్యాని కి ఆశపడి రాజకీయ నాయకుల మీటింగ్ కు వెళ్తే...వాళ్లందరూ ఓటు వేయరని... గుర్తు చేశారు. కానీ పుష్ప 2 ఈవెంట్ కు వచ్చిన జనాలు అంతా సినిమా చూసి ఆదరిస్తేనే...1000 కోట్లు దాటాయని తెలిపాడు. ఇకపై ఒక హీరోను కించపరిచేలా సిద్ధార్థ మాట్లాడకూడదని కూడా హెచ్చరించారు. దీంతో వీరిద్దరి మధ్య వార్  హాట్ టాపిక్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: