ప్రియుడుతో కలిసి ఏడడుగులు వేసిన కీర్తి సురేష్.. ఫొటోస్ వైరల్..!

Divya
టాలీవుడ్, కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా మంచి పాపులర్ సంపాదించుకున్న కీర్తి సురేష్ ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టింది.. అయితే గత కొంతకాలంగా కీర్తి సురేష్ పెళ్లి విషయంపై పలు రకాల రూమర్స్ వినిపించినప్పటికీ ఇటీవలే తిరుపతిలో కూడా దర్శనానికి వచ్చినప్పుడు కీర్తి సురేష్ స్వయంగా తన పెళ్లి జరుగుతోందని అందుకే దేవుడు దర్శనానికి వచ్చారని చెప్పి అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది.. అయితే ఇప్పుడు తాజాగా కీర్తి సురేష్ పెళ్లి అయిపోయినట్టుగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే పెళ్లికి సంబంధించి అన్ని విషయాలను కాస్త సీక్రెట్ గానే ఉంచింది కీర్తి సురేష్..

గత కొన్ని రోజులుగా కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించి పనులకు కూడా జరుగుతున్నట్లు అందుకు సంబంధించి ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. తన లాంగ్ టైం బాయ్ ఫ్రెండ్ ఆంటోనీ నీ ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈరోజు. గోవాలో వీరి పెళ్లి ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో సన్నిహితుల సమక్షంలో జరిగినట్లు తెలుస్తోంది. హిందూ సాంప్రదాయ పద్ధతిలో కీర్తి సురేష్ వివాహం జరిగినట్లుగా సమాచారం అలాగే మరొక పద్ధతి అయిన క్రిస్టియన్ లో కూడా పెళ్లి జరుగుతుందని టాక్ కూడా ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది.

మొత్తానికి కీర్తి సురేష్ సైలెంట్ గా ఏడు అడుగులు వేసి అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ ఫోటోలకు అభిమానులు నేటిజన్స్ సినీ సెలబ్రిటీలు సైతం ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ ఫోటోలో కీర్తి సురేష్ ఆనందానికి అవధులు లేకుండా ఉన్నట్టుగా కనిపిస్తోంది. అలాగే తనకు ఇష్టమైన ప్రియుడుతో ఏడడుగులు వేయడం మరింత ఆనందంగా ఉందన్నట్టుగా కనిపిస్తోంది. కీర్తి సురేష్ ప్రస్తుతం బాలీవుడ్ లో  ఒక సినిమాలో నటిస్తూ ఉన్నది. అలాగే రివాల్వర్ సీత అనే చిత్రంలో కూడా నటిస్తున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: