ఎన్టీఆర్ - రజనీకాంత్ ' టైగర్ ' సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ.. మతులు పోవాల్సిందే.. !
టాలీవుడ్ ఎన్టీఆర్ , రజనీకాంతులు కలిసి నటించిన సినిమా . 1979 లో వచ్చిన ఈ టైగర్ సినిమా రజనీకాంతుకి యాభయ్యో సినిమా . నవశక్తి బేనరు పై నిర్మించబడిన ఈ సినిమా కు నందమూరి రమేష్ దర్శకుడు . 1977 లో వచ్చిన హిందీ సినిమా ఖూన్ పసీనాకు రీమేక్ . హిందీలో అమితాబ్ , వినోద్ ఖన్నా , రేఖ , నిరూపరాయ్ తదితరులు నటించారు . హిందీలో ఆడినంతగా తెలుగులో ఆడలేదు . పాటలు కూడా బాగుంటాయి. . ఇద్దరు స్నేహితులు చిన్నప్పుడు దోపిడీదారులు తమ గ్రామాన్ని తగలబెట్టడంతో విడిపోతారు . వారిలో ఒకడయిన రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ అవుతాడు . ఇంకొకడు ఎన్టీఆర్ దీన జన రక్షకుడు అవుతాడు . ఇద్దరూ విలన్ని తుదముట్టిస్తారు . సినిమాలో యన్టీఆర్ పేరు టైగర్ . . సినిమాలో టైగరుతో కూడా పోరాడతాడు .
ఈ సినిమాలో అంజలీదేవి యన్టీఆర్ తల్లిగా నటించింది . సాధారణంగా ఆడవారికి వయసు పెరగదు.. ఏ ముప్పై దగ్గరో , పాతిక దగ్గరో వయసు ఆగిపోతుంది అని అంటారు . సినిమాల్లో మాత్రం హీరోల వయసు పెరగకుండా ఆగిపోతుంది . హీరోయిన్లుగా నటించిన యస్ వరలక్ష్మి , జి వరలక్ష్మి , అంజలీదేవి , శ్రీరంజని , పుష్పలత ఎన్టీఆర్ - ఏఎన్నార్ ఇద్దరికీ తల్లులుగా నటించారు . రాధా సలూజా నటించిన ఏకైక తెలుగు సినిమా ఇది . ఆమె ప్రముఖ హిందీ - పంజాబీ నటి అన్న విషయం తెలిసిందే. ఇక టైగర్ లో మరో హీరోయిన్ గా జయసుధ చెల్లెలు సుభాషిణి నటించింది . ఈ సినిమాకు వీరిద్దరూ మైనస్ పాయింట్లే .