మన భారతీయ చిత్ర పరిశ్రమ లో ఒక భాషలో హిట్ అయిన సినిమా ను మరో భాష లో రీమిక్ చేయడం అనేది ఎంతో కామన్ .. అయితే ఒక భాష లో హిట్ అయినా సరే మారో భాష లో రీమేక్ అయితే అక్కడ కూడా సినిమా ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటుంది .. చాలా తక్కువ సినిమా లు మాత్రమే రీమేక్ అయితే ప్లాప్ అవుతూ ఉంటాయి .. అయితే మన ఇండియన్ చిత్ర పరిశ్రమ లోనే ఒక సినిమా అత్యధిక భాషల్లో రీమేక్ అయింది .. ఏకంగా ఆ సినిమా మన ఇండియన్ భాషల తో పాటు మన పక్క దేశాల్లో కూడా ఈ సినిమా రిమెక్ చేస్తే హిట్ అయింది ..
ఇంతకీ ఆ సినిమా మారేదో కాదు ప్రభుదేవా దర్శకత్వం లో వచ్చిన నువ్వు వస్తానంటే నేనొద్దంటానా .. ఈ సినిమా ను తెలుగు లో సిద్ధార్థ , త్రిష జంట గా నటించారు .. అయితే ఈ సినిమా బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ , భాగ్యశ్రీ నటించిన మైనే ప్యార్ కియా సినిమా కు కాస్త దగ్గరగా ఉంటుంది .. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం కావడం తో మన భారతీయ భాష లో హిందీతో పాటు తమిళం , కన్నడ , బెంగాలీ , ఒరిస్సా , పంజాబీ ఇలా అన్ని భాషల్లో రీమేక్ అయింది .. వీటితో పాటు బంగ్లాదేశ్ , నేపాల్ వంటి ఇతర దేశాల్లో కూడా ఈ సినిమాను రీమేక్ చేశారు . అయితే ఇలా రీమిక్ అయినా ఈ సినిమా ఒక హిందీ భాషలో తప్ప అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది . ఇలా మన భారతీయ సినిమా చరిత్ర లోనే అత్యధిక భాషలో రీమేక్ అయిన తొలి సినిమాగా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా రికార్డు క్రియేట్ చేసింది .