సౌత్‌లో మళ్ళీ బిజీ అవుతున్న పూజా హెగ్డే.. చేతిలో ఎన్ని సినిమాలున్నాయో తెలుసా..?

Pulgam Srinivas
సౌత్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్న నటి ననులలో పూజా హెగ్డే ఒకరు. ఈ ముద్దు గుమ్మ నాగ చైతన్య హీరో గా రూపొందిన ఒక లైలా కోసం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా మంచి విజయం సాధించడం , ఇందులో ఈ నటి తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టి పడేయడంతో ఈ మూవీ తర్వాత తెలుగు లో ఈమెకు వరుసగా అవకాశాలు దక్కాయి. ఈమె అనేక టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్గా నటించడం , అందులో చాలా మూవీలు మంచి విజయాలు సాధించడంతో తక్కువ కాలం లోనే పూజా హెగ్డే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. తెలుగు తో పాటు ఈమె కొన్ని తమిళ సినిమాలలో కూడా నటించింది.

ఇది ఇలా ఉంటే ఒకానొక సమయంలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా కెరియర్ ను కొనసాగించిన ఈ బ్యూటీకి వరుస అపజయాలు దక్కడంతో ఒక్క సారిగా అవకాశాలు తగ్గిపోయాయి. దానితో కొంత కాలం నుండి ఈమె నటించిన సినిమాలు విడుదల కూడా కాలేదు. మళ్లీ ఈ నటికి వరుస పెట్టి సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. ఇప్పటికే ఈమె నాగ చైతన్య తదుపరి మూవీ లో హీరోయిన్గా ఎంపిక అయినట్లు తెలుస్తోంది. అలాగే తమిళ నటుడు సూర్య 44 సినిమాలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాతో పాటు తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ 69 మూవీ లో కూడా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా నటిస్తోంది. ఇలా ఇంత కాలం పాటు సైలెంట్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే మూడు సౌత్ సినిమాలను ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలు కనుక మంచి విజయాలు సాధిస్తే ఈమెకు మళ్ళీ అవకాశాలు చాలా వరకు పెరిగే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: