రు. 1000 కోట్ల పుష్ప 2 రికార్డులు.. బోరుమంటోన్న బయ్యర్లు....!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ఈనెల 5 న ప్రపంచ వ్యాప్తంగా ధియేటర్లోకి వచ్చింది. సినిమాకు తొలి రోజు తొలి ఆటకే మంచి టాక్ వచ్చింది. ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న పుష్పరాజు గాడు రూల్ మామూలుగా చేయటం లేదు. కేవలం ఆరు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రు. 1000 కోట్ల క్లబ్ లోకి వచ్చేసింది. పుష్ప ఓ వైపు రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తోందన్న ప్రచారం గట్టిగా నడుస్తోంది. ఎక్కడ చూసినా పుష్ప 2 వసూళ్ల మోత మోగించేస్తోంది. అయితే బయ్యర్లు మాత్రం లబోదిబో మంటున్నారట.
అదేంటి ఇంత పెద్ద పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అయిన సినిమా కొన్న వారికి ఎందుకు భయం పట్టు కుంది ? ఎందుకింత టెన్షన్ అనుకుంటున్నారా ? టిక్కెట్ రేట్లు విపరీతంగా పెంచేశారు. సినిమా ఇప్పటి వరకు చూడాలని అనుకున్న వాళ్లంతా దాదాపు థియేటర్ల లో కి వచ్చేశారు. కలెక్షన్లు ఒక్కసారిగా డ్రాఫ్ అయిపోయాయి. ఇక ఏపీ లో అయితే మెగా అభిమానులు పుష్ప 2 సినిమా ను బ్యాన్ చేయాలని . . అప్రకటిత బ్యాన్ విధించారు. ఇది కూడా కలెక్షన్లు బాగా డ్రాప్ కావడానికి కారణం అనుకోవాలి. ఇక సినిమా ను బాగా ఎక్కువ రేట్లకు అమ్మారు. ఇది కూడా సినిమా కు బాగా వసూళ్ల పరంగా దెబ్బ పడడానికి కారణ మైంది. ఇక వాస్తవంగా వస్తోన్న కలెక్షన్ల కు ... చూపిస్తోన్న . . చెపుతోన్న అంకెలకు కూడా సంబంధం లేదని అంటున్నారు. అందుకే ఈ లెక్కలు పైకి చెప్పు కోవడాని కే గాని .. వసూళ్లు అంత లేవని అంటున్నారు.