వ్యభిచారం కేసు పై.. హీరోయిన్ యమున షాకింగ్ కామెంట్స్..!
అలా ఒక్కసారిగా యమున కెరియర్ పడిపోయింది.. యమునని చాలామంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారట. అందుకే ఆమె కొంత కాలం మీడియాకి కూడా దూరంగా ఉన్నానని తెలిపింది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న యమున తనలోని బాధను ఆవేదన సైతం తెలియజేసింది.. తాను ఎప్పుడూ కూడా ఎలాంటి తప్పు చేయలేదని కావాలని కొంతమంది వ్యభిచారం కేసులో తనను ఇరికించినట్లు కన్నీళ్లు పెట్టుకొని తెలియజేసింది.. అసలు ఆరోజు తను ఏ హోటల్ కి వెళ్ళలేదని.. కానీ తన మీద పడిన మచ్చకి తాను సూసైడ్ చేసుకోవాలనుకున్నానని తెలిపింది.
కానీ తను చనిపోతే తన పిల్లలను చూసేవారు ఉండారని అలాగే తన పిల్లలకు కూడా చెడ్డ పేరు ఉంటుందని అందుకే ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయాన్ని విరమించుకున్నానని తెలిపింది. కానీ తన స్నేహితురాలలో ఒకరైన ఆమె తనకు బ్రెయిన్ వాష్ చేసి ఆ ఆలోచన నుంచి బయటపడేలా చేసిందని పిల్లల కోసం తనని మనో ధైర్యాన్ని తెచ్చుకొని జీవించాలని చెప్పిందని తెలిపారు.. మనమేంటో మనకు తెలియాలి ఎదుటివారి మాటలను అసలు పట్టించుకోకూడదని తెలిపింది. ప్రస్తుతం నటిగా బుల్లితెరపై కూడా పలు సీరియల్స్ లో నటిస్తూ ఉన్నది యమున. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు కూడా ఎక్కడో ఒకచోట సొల్యూషన్ అనేది ఉంటుందని తెలిపింది యమున.