పుష్ప 2: వైసీపీ మహిళా నేత సంచలన ట్వీట్..!
ఐకాన్ స్టార్.. మీ పుష్ప-2 ది రూల్ చిత్రం నిజంగానే అంచనాలకు మించి ఉంది.. పుష్పతో తగ్గేదే అన్నారు పుష్ప-2 తో అసలు తగ్గేదేలే దని నిరూపించారు.. మా చిత్తూరు యాసతో వెండితెర పైన పలికిన తీరు ఈలలు వేయించేలా చేస్తోంది. అల్లు అర్జున్ గారి నటన అద్భుతం, యావద్దేశాన్ని సైతం మీ మాస్ ఇమేజ్తో పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అనేటట్టుగా పూనకాలు తెప్పించారు. మా తిరుపతి గంగమ్మ జాతర సీన్ ఈ సినిమాకి హైలైట్ అని తెలియజేసింది. అందులో నటించిన తీరు శభాష్ అనిపించేలా ఉందని తెలిపింది రోజా.. మీ శ్రమకి తగ్గ ఫలితమే ఈ చిత్ర విజయం అంటూ చిత్ర యూనిట్ శుభాకాంక్షలు తెలియజేసింది వైసీపీ ఎమ్మెల్యే రోజా.
లెక్కల మాస్టర్ సుకుమార్ గారు చిత్తూరు యాస గ్లోబల్ స్క్రీన్ పై చిందులేయించారని.. మీ రైటింగ్ తో ఒక్క మాటలో చెప్పాలి అంటే సబ్జెక్టుని చాలెంజింగ్ గా తీసుకొని ఒక బాషఏ కాదు యాసే కాదు వేషానికి కూడా 100% న్యాయం చేయించారు నటీనటులతో అంటూ తెలిపింది.. చిత్తూరు యాసలో చెప్పాలి అంటే.. ప్రతి ఊరు కూడా రేయ్ మచ్చ ఎవడ్రా వీడు అని మాట్లాడుకునేలా చేశారని తెలియజేసింది.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తున్నారు గంగమ్మ జాతరను వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా చాలా విజయవంతంగా జరిపించామని మీరు 3:20 నిమిషాల సేపు ప్రేక్షకులను ఊపిరాడనివ్వకుండా చేశారని తెలిపింది.. ఒక స్టార్ హీరో చీర కట్టుకొని పసుపు రాసుకొని గంధం పూసుకొని జాతరలో మాతంగి వేషం వేసి స్క్రీన్ పైన అద్భుతంగా చూపించిన తీరు అందరికీ అమోహం అలాగే రష్మిక సూపర్ గా నటించింది అంటూ పుష్ప-2 రివ్యూ ఇచ్చింది వైసిపి మహిళా నేత రోజా.