గొడవలోకి కూతురును లాగడం అమానవీయం.. మనోజ్ సంచలన వ్యాఖ్యలు!

Reddy P Rajasekhar
మంచు ఫ్యామిలీ వివాదం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా సంచలనం అయింది. ఫ్యామిలీలో తలెత్తిన విబేధాల వల్ల మోహన్ బాబు మనోజ్, అతని భార్యపై ఫిర్యాదు చేయగా ఆ ఫిర్యాదుపై కేసు నమోదైంది. మనోజ్ ఆ ఆరోపణలపై స్పందిస్తూ నా పరువు మర్యాదలను కావాలని తీసే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. తనకు న్యాయం చేయాలని రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలను సైతం మనోజ్ కోరారు.
 
ఆ ఆరోపణలు పూర్తిగా కల్పితమని నేను ఎలాంటి ఆస్తిపాస్తులు అడగలేదని అలాంటి ఆలోచన సైతం సరైనది కాదని మనోజ్ అన్నారు. ఈ వివాదంలోకి ఏడు నెలల నా కూతురును సైతం లాగారని ఇలాంటి విషయాల్లోకి పిల్లలను లాగవద్దని మనోజ్ పేర్కొన్నారు. ఇంట్లో ఉన్న సీసీ ఫుటేజీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. నేనెప్పుడూ కుటుంబ ఆస్తులను అడగలేదని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు.
 
ఆర్థిక అవకతవకలకు సంబంధించి నా దగ్గర ఆధారాలు ఉన్నాయని మనోజ్ చెప్పుకొచ్చారు. నా త్యాగాలు ఉన్నప్పటికీ నకు అన్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు. నేను ఎప్పుడైనా ఆస్తులు, వారసత్వం కావాలని అడిగానా అంటూ మనోజ్ ప్రశ్నించారు. కుటుంబంలోని డబ్బులను ఎవరు వృథా చేస్తున్నారంటూ కామెంట్లు చేశారు. న్యాఅం గెలుస్తుందని ఆశిస్తున్నానని మనోజ్ పేర్కొన్నారు.
 
నాకు , నా ఫ్యామిలీకి మద్దతుగా నిలుస్తున్న వాళ్లకు ధన్యవాదాలు అని మనోజ్ వెల్లడించారు. పరిస్థితులు సవాళ్లను విసిరినా వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని మనోజ్ చెప్పుకొచ్చారు. మనోజ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. మనోజ్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ వివాదానికి సంబంధించి రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. మంచు మనోజ్ ఈ వివాదం నుంచి బయటపడాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. మనోజ్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: