భారీ బడ్జెట్ కాదు.. కమర్శియల్ ఎలిమెంట్స్ లేవ్.. కానీ కార్తికేయ సీక్వెల్ సూపర్ హిట్?

praveen
ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో సీక్వెల్ సినిమాల హవా కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఒక సినిమా విడుదలై సూపర్ హిట్ సాధించింది అంటే చాలు ఆ సినిమాకు సీక్వల్ గా మరో సినిమాను తెరకెక్కించడం ట్రెండ్ గా కొనసాగుతూ వస్తుంది. అయితే కొత్త కథ రాసుకొని సినిమా తీస్తే అది హిట్ అవుతుందో లేదో అన్నది డౌటే. కానీ అప్పుడు ఆల్రెడీ హిట్ అయిన సినిమాకు సీక్వల్ తీస్తే ఇక ఆ సినిమాపై ఉండే భారీ అంచనాలే సినిమా హిట్టుకు కారణం అవుతాయని దర్శక నిర్మాతలు కూడా భావిస్తూ ఉంటారు. అందుకే ఇలాంటి సీక్వల్ సినిమాలు వైపే ఎక్కువగా చూపిస్తూ ఉన్నారు.


 టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి సీక్వల్ సినిమాలు చాలానే ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. అయితే భారీ అంచనాల మధ్య వచ్చిన కొన్ని సీక్వెల్స్ అట్టర్ ఫ్లాప్ గా మిగిలిపోతే.. ఇంకొన్ని మాత్రం సూపర్ విజయాన్ని సాధించాయి అని చెప్పాలి. ఇలా హిట్ అయిన సినిమాకు సీక్వెల్ గా వచ్చి సూపర్ హిట్స్ సాధించిన సినిమాల్లో కార్తికేయ మూవీ కూడా ఒకటి . ఈ సినిమాలో భారీ తారాగణం లేదు. కమర్షియల్ ఎలిమెంట్స్ అంతకంటే లేవు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించగలిగింది.


 నిఖిల్ సిద్ధార్థ హీరోగా 2014లో వచ్చిన కార్తికేయ సినిమా సూపర్ హిట్ అయింది. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ స్టోరీ ప్రేక్షకులను మెప్పించగలిగింది. అయితే చాలా గ్యాప్ తర్వాత 2022 ఆగస్టులో కార్తికేయ సినిమాకు సీక్వెల్ మూవీ ని ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చారు చిత్ర బృందం. అయితే ఈసారి తెలుగుతోపాటు హిందీలో కూడా ఏకకాలంలోనే రిలీజ్ అయ్యారు. ఇలా సౌత్ లోనే కాదు అటు బాలీవుడ్ గడ్డపై కూడా కార్తికేయ 2 సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలోని కథ కథనం అన్ని ప్రేక్షకులను మెప్పించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: