ఫియర్ ట్రైలర్ తో భయపెట్టడానికి సిద్ధమైన హీరోయిన్ వేదిక..!

Divya
పలు రకాల వెబ్ సిరీస్లలో సినిమాలలో నటించిన హీరోయిన్ వేదిక.. ఇప్పుడు తాజాగా మెయిన్ లీడ్ గా నటిస్తున్న హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ఫియర్. ఈ సినిమాని దత్తాత్రేయ మీడియా బ్యానర్ పైన నిర్మిస్తూ ఉన్నారు. డాక్టర్ హరిత గోనినేని డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 14న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ బాగానే ఆకట్టుకున్నాయి.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ నీ సైతం చిత్రబృందం రిలీజ్ చేయడం జరిగింది.

ట్రైలర్ విషయానికి వస్తే ఒక లవ్ స్టోరీ తో మొదలయ్యి..హీరోయిన్ ఒక్కటే ఇంట్లో ఉంటూ తన పని తాను చేసుకుంటూ ఉంటున్న సమయంలో తనని ఎవరూ వెంటాడుతున్నట్లుగా చూపించారు.. అలా భయపెడుతున్న వ్యక్తి ఎవరు? ఇంతకు హీరోయిన్ ఎందుకు భయపెడుతున్నారు అనే కథతో ఈ ఫియర్ సినిమాని తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. అయితే ఈ ఫియర్ సినిమా థియేటర్లో ప్రేక్షకులను ఎలా భయపడుతుందో చూడాలి. అయితే ఈ ఫియర్ సినిమా రిలీజ్ కాకముందే పలు రకాల అంతర్జాతీయ ప్రతిష్టాత్మకమైన ఫిలిం ఫెస్టివలలో కూడా 70 కి పైగా అవార్డులు సైతం గెలుచుకున్నదట.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని నటుడు మాధవన్ తన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసేలా చిత్ర బృందం ప్లాన్ చేసింది.. ఫియర్ సినిమాలో పలువురు సీనియర్ నటీనటులు సైతం నటించారు. మొత్తానికి హీరోయిన్ వేదిక గతంలో హార్ట్ గా అందరినీ అలరించిన ఈ అమ్మడు ఇప్పుడు మరి హర్రర్ సినిమాతో ఏ విధంగా భయపెడుతుందో చూడాలి మరి. ప్రస్తుతం ఈ ట్రైలర్ అయితే కాస్త భయపెట్టేలా కనిపిస్తోంది. ఈ సినిమాతో వేదికకు మరిన్ని సినిమా అవకాశాలు రావాలని అభిమానులైతే కోరుకుంటున్నారు. ఒకవేళ ఈ ఫియర్ సినిమా సక్సెస్ అయ్యిందంటే చాలు కచ్చితంగా ఈమెకు టాలీవుడ్లో అవకాశాలు రావడం ఖాయమే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: