మనోజ్ పై దాడి చేసింది మోహన్ బాబు కాదా...అసలు ఇంట్లో ఏం జరిగిందంటే.?

FARMANULLA SHAIK
టాలీవుడ్ సీనియ‌ర్ నటుడు మంచు మోహ‌న్ బాబుపై పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదు అయ్యింది.తనతో పాటు తన భార్య‌పై మోహ‌న్ బాబు దాడిచేశాడ‌ని స్వయంగా ఆయన కొడుకు మంచు మనోజ్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు. గాయాల‌తోనే పోలీస స్టేషన్ కు వెళ్లిన మ‌నోజ్ మోహ‌న్ బాబుపై ఫిర్యాదును అందించాడు.  ఈ మేరకు మోహన్ బాబుపై పహడి షర్రిఫ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మరోవైపు మనోజే తనపై దాడి చేశాడని మోహన్ బాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆస్తులు, స్కూల్ వ్య‌వ‌హారంపై ఈ గొడవ‌లు జ‌రిగిన‌ట్లు తెలుస్తుంది.  కాగా కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో  తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ మధ్యన మంచు విష్ణు, మనోజ్ ల మధ్య పెద్ద గొడవే జరిగింది.  మంచు విష్ణు.. మనోజ్ ఇంటికి వచ్చి మరీ కొడతానని వార్నింగ్ ఇచ్చాడు. ఈ కారణంగానే మనోజ్ పెళ్లిలో ఎక్కువగా కనిపించలేదు మంచు విష్ణు.  ఇప్పుడు ఏకంగా తండ్రీ కొడుకులు గొడవ పడడం సంచలనంగా మారింది. సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబును క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకుంటారు. అలాంటిది వారి కుటుంబంలోనే ఇలాంటి గొడవలు రేగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఈ క్రమంలో అస్సలువిషయానికొస్తే మోహన్ బాబు తన ముగ్గురు పిల్లలకు ఆస్తులు పనిచేయగా విద్యాసంస్థల్లో వాటాపై మనోజసంతృప్తిగా ఉన్నారని తెలుస్తుంది ఈ అంశం పైన శనివారం రాత్రి డైలాగ్ కి నివాసంలో భేటీ అయ్యారు గొడవ జరగడంతో మోహన్ బాబు అనుచరుడు వినయ్ మనోజ్ పై దాడి చేసినట్లు సమాచారం.

ఇదిలావుండగా మోహన్ బాబు యూనివర్సిటీ వ్యవహారాలు చూసే వినయ్ అనే వ్యక్తికి, మనోజ్ మంచుకు మధ్య గొడవ జరిగిందని తెలిసింది. వాళ్ళిద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చింది అని వివరాలు తెలియాల్సి ఉంది. ఆ గొడవ మీద 100కు డయల్ చేసి చెప్పడం, అది మీడియాకు లీక్ కావడం వెంట వెంటనే జరగాయి. అంతే తప్ప. ఏ పోలీస్ స్టేషన్ లోనూ ఫిర్యాదు నమోదు కాలేదు. మనోజ్, వినయ్ మధ్య గొడవ జరిగితే దానిని తండ్రి మోహన్ బాబు, తనయుడు మనోజ్ మధ్య గొడవగా కొంతమంది చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇంకొంత మంది ఔత్సాహికులు మరో అడుగు ముందుకు వేసి గాయాలతో మనోజ్ పోలీస్ స్టేషన్ వచ్చారని ఊహాజనిత కథనాలు అల్లేశారు. ఇప్పటివరకు మనోజ్ పోలీస్ స్టేషన్కు వెళ్ళలేదు. అయితే ఫోన్ చేయడం మాత్రం నిజం. ఆయనకు గాయాలు కాలేదు. అయితే రక్తం కారుతున్న గాయాలతో మనోజ్ ఫిర్యాదు చేశాడని పలువురు పేర్కొనడం విశేషం. ఆ మధ్య ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో విద్యార్థులకు మద్దతుగా మనోజ్ మాట్లాడారు. ఒకవేళ ఆ అంశంలో వినయ్ అనే వ్యక్తితో ఆయన మాట్లాడారని తెలుస్తోంది. ఆ సమయంలో ఆగ్రహం వ్యక్తం చేసి ఉండొచ్చు. తండ్రి కొడుకులు మధ్య కొట్లాట జరిగిందనేది పూర్తిగా అవాస్తవం.ఈ క్రమంలో మోహన్ బాబు నిద్రలో ఉన్న సమయంలో ఆయనకు తనయుడికి మధ్య గొడవ జరిగిందని న్యూస్ ఛానళ్లలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను నిద్ర లేపారని, ఆ వార్తలు చూసి షాక్ అయ్యారని తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: