పుష్ప-3 పై అభిమానుల ఆశలు.. కానీ వచ్చేది ఎప్పుడో తెలుసా?
దాదాపు మూడేళ్ల నుంచి ఈ సినిమా కోసం అభిమానులు అందరూ కూడా నిరీక్షణగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇటీవల 50 దేశాలలో ఎంతో గ్రాండ్గా ఈ సినిమాను రిలీజ్ చేశారు. అయితే ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో అదే రేంజ్ లో వసూళ్లు కూడా సాధిస్తుంది. కేవలం మూడు రోజుల్లోనే 500 కోట్ల వసూళ్లను క్రాస్ చేసేసింది పుష్ప 2. అయితే ఇప్పటికే రెండు పార్ట్ లు తెరకెక్కగా పుష్ప సినిమాకు మూడవ పార్ట్ కూడా ఉంటుంది అని ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేశారు అన్న విషయం తెలిసిందే. సినిమా ఎండింగ్ లో ఇందుకు సంబంధించిన ఒక ట్విస్ట్ పెట్టేసాడు సుక్కు.
దీంతో అభిమానులు అందరిలో కూడా మూడవ పార్ట్ పై కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా ఎప్పుడు ఉంటుందో అని తెలుసుకునేందుకు ఫ్యాన్స్ అందరు తెగ ఆరాటపడుతున్నారు అని చెప్పాలి. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు ఫ్యాన్స్. అయితే టాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఇప్పట్లో పుష్ప 2 లేనట్లే అని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రెండు పార్ట్ ల కోసం 5 ఏళ్ళు కేటాయించాడు అల్లు అర్జున్. అయితే ఇక ఇప్పుడూ తర్వాత త్రివిక్రమ్ తో కలిసి ఒక ప్రత్యేకమైన కథతో బన్నీ సినిమా చేయబోతున్నాడట. ఇది పూర్తయి రిలీజ్ అయిన తర్వాతే పుష్ప-3 గురించి ఆలోచిస్తాడని తెలుస్తుంది.