ఇప్పుడు సుకుమార్ నెక్స్ట్ త్రివిక్రమ్..బన్నీని భలే సేవ చేస్తున్నారుగా..!

Thota Jaya Madhuri
ఎస్ ప్రజెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. అల్లు అర్జున్ జాతకం  ఇలా దశ తిరుగుతుంది ఏంటి..? అని జనాలు ఎక్కువుగా మాట్లాడుకుంటున్నారు. ఆ కారణంగానే పుష్ప2 సినిమా హిట్ అందుకుని ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని ఏలేసే స్థాయికి ఎదిగిపోయాడు బన్ని అని జనాలు మాట్లాడుకుంటున్నారు . నిజానికి బాహుబలి సినిమా తర్వాత అలాంటి ఒక బిగ్ బడా సినిమా వస్తుంది అని ఆ సినిమా రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అని ఏ అభిమాని ఏ జనాలు కూడా అనుకోలేక పోయారు. 


కానీ ఎవరు ఊహించిన విధంగా సుకుమార్ పుష్ప సినిమాను తెరపైకి తీసుకువచ్చి ..ఆ సిరీస్ ను రెండు భాగాలు గా తెరకేక్కించి పుష్ప2 తో ఆల్ ఇండియా హిట్ అందుకున్నాడు . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు రోజుల్లోనే 641 కోట్లు కలెక్ట్ చేసి సినిమా ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసాడు . ఇప్పుడప్పుడే ఈ రికార్డు బద్దలు కొట్టే సత్తా ఏ హీరోకి లేదు అన్న విషయం అందరికీ తెలిసిందే . అయితే ఇంత పెద్ద హిట్ అందుకున్న తర్వాత కచ్చితంగా మళ్ళీ అలాంటి పెద్ద హిట్ అందుకోవడం చాలా చాలా కష్టం . కానీ ఓ మోస్తరు హిట్ అందుకోవచ్చు . అలాంటి డైరెక్టర్ తోనే కమిట్ అయ్యాడు బన్నీ .


మనకు తెలిసిందే బన్నీ నెక్స్ట్ సినిమాని త్రివిక్రమ్ శ్రీనివాస్ రావ్ తో కమిట్ అయ్యాడు.  ఈ సినిమా అఫీషియల్ అప్డేట్ ఎప్పుడో వచ్చేసింది . అయితే బన్నీ అదృష్టం భలే బాగుంది అని ..మొదటి సినిమా డైరెక్టర్ సుకుమార్ తో కమిట్ అయి సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు అని .. ఆ తర్వాత తన లక్కీ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తోనే కమిట్ అయ్యి వాళ్ల కాంబోని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు అని .. అల్లు అర్జున్ ని భలే సేవ్ చేస్తున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు - సుకుమార్ అంటున్నారు  జనాలు. పొలిటికల్ పరంగా కూడా పవన్ కళ్యాణ్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ రావుకి మంచి దోస్తీ ఉంది. బన్నీ సినిమాని టెన్షన్ లో పెట్టడానికి పవన్ కళ్యాణ్ ఏ మాత్రం ఇంట్రెస్ట్ చూపరు. ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్ కదా ..? సో ఖచ్చితంగా నెక్స్ట్ సినిమా కూడా పుష్ప2 అంత హిట్టు కాకపోయినా ఖచ్చితంగా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద హిట్టుగా మిగిలిపోతుంది. దీంతో అల్లు అర్జున్ సేఫ్గా తప్పించుకున్నాడు అంటున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: