ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “..ఈ సినిమా డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయిన ఈ సినిమా మెదటి షో నుండి పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.. మొదటి రోజు ఏకంగా 294 కోట్ల భారీ ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా మూడు రోజులకు మొత్తంగా రూ. 621 కోట్ల కలెక్షన్స్ సాధించింది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు.. ఎట్టకేలకు రిలీజ్ కావడంతో థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హంగామా మాములుగా లేదు.. సినిమాలో అల్లుఅర్జున్ రప్పా రప్పా పెర్ఫార్మన్స్ అదిరిపోతుంది. క్లైమాక్స్ ఫైట్ చూసి ఫ్యాన్స్ గూస్ బంప్స్ తో ఊగిపోతున్నారు..అయితే రిలీజ్ కి ముందు ఈ సినిమాపై వున్న నెగిటివిటి అంతా పుష్ప రాజ్ మేనియాలో కొట్టుకుపోయాయి.ఈ చిత్రం ఇంతలా ఆదరణ అందుకోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచిన క్రేజీ సన్నివేశాల్లో క్లైమాక్స్ సీక్వెన్స్ రప్పా రప్పా యాక్షన్ బ్లాక్ కూడా ఒకటి అని చెప్పొచ్చు.
అల్లు అర్జున్ అమ్మవారి రూపంలో విశ్వరూపం చూపించిన ఈ సన్నివేశం సినిమాలో ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించింది.. ఈ కీలక యాక్షన్ అండ్ ఎమోషనల్ ఫైట్ ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంది... అంతా ఎంతో ఎదురు చూసిన జాతర సన్నివేశం కానీ.. ఇపుడు క్లైమాక్స్ లో చూపించిన రప్పా రప్పా సీన్ కానీ సినిమాలో పుష్ప రాజ్ కూతురు వరుస అయిన అమ్మాయి కోసమే జరుగుతుంది..తన అన్న కూతురు పుష్ప రాజ్‌ను చిన్నాయన చిన్నాయన అంటూ ఎంతో ప్రేమగా పిలుస్తుంది..ఆమెను కాపాడటం కోసం పుష్ప రాజ్ చేసే ఫైట్ థియేటర్ లో ప్రేక్షకుడికి పూనకం తెప్పిస్తుంది... ఈ సినిమాలో పుష్ప రాజ్ కూతురిగా కనిపించిన ఆ యువ నటి పేరు పావని కరణం. ఈమె పుష్ప2 విడుదల తర్వాత నుంచి సోషల్ మీడియాలో ఎంతో పాపులర్ అయింది.. తాజాగా తాను నటించిన క్లైమాక్స్ సీన్ సెట్స్ నుంచి దిగిన ఫోటోలు షేర్ చేసింది.క్లైమాక్స్ సీన్ సెట్స్ లో తన లుక్, మేకప్ కి సంబంధించి ఫోటోలు అలాగే బ్యాక్గ్రౌండ్ పోస్టర్స్ ఆమె షేర్ చేసుకుంది. దీనితో ఈ పిక్స్ బాగా వైరల్ అయ్యాయి.