పుష్ప 2: ఫ్యాన్స్ గుడ్ న్యూస్..భారీగా తగ్గిన టికెట్ ధరలు..ఎంతంటే..?

Divya
డిసెంబర్ 5వ తేదీన పుష్ప-2 చిత్రం పాన్ ఇండియా లెవెల్లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.. మూడు రోజుల్లో గాను రూ.621 కోట్ల రూపాయలను రాబట్టింది ఈ చిత్రం.. యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా వచ్చిన పుష్ప-2 లో అల్లు అర్జున్ యాక్టింగ్, రష్మిక నటన ప్రేక్షకులను ఫిదా అయ్యేలా చేశాయి.. అయితే ఇప్పుడు ఆడియన్స్ నుంచి భారీగా టాక్ రావడంతో త్వరలోనే టికెట్ ధరలు కూడా అందరికీ అందుబాటులో ఉంచేలా చూస్తామంటూ నిర్మాతలు తెలిపారు. అందుకు తగ్గట్టుగానే ఈరోజు నుంచి పుష్ప-2 సినిమా టికెట్ ధరలు స్వల్పంగా తగ్గించబోతున్నట్లు తెలియజేశాయి.

బుక్ మై షోలో టికెట్ ధరలు కూడా స్వల్పంగా తగ్గినట్లు కనిపిస్తోంది.. రెండు తెలుగు రాష్ట్రాలలో డిసెంబర్ 4న స్పెషల్ ప్రీమియర్ షోలకు మాత్రమే రూ .800 రూపాయలు ధరలు నిర్ణయించారు..ఆదివారం వరకు సింగల్ స్క్రీన్ కి 150 రూపాయలు మల్టీప్లెక్స్ లకు 200 రూపాయలు పెంచారు.. దీంతో పుష్ప-2 సినిమా చూడాలి అంటే 500 పైన చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. డిసెంబర్ 9 నుంచి 16వ తేదీ వరకు సింగల్ స్క్రీన్ లలో 105 రూపాయలు మల్టీప్లెక్స్ 150 మాత్రమే ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చారట.

సింగిల్ స్క్రీన్ లలో 200 రూపాయలు .. మల్టీప్లెక్స్లలో 395 ఉన్నదట.. ఈ ధరలు కాస్త తగ్గడంతో అభిమానులు కూడా కాస్త ఆనందపడుతున్నారు.. తమ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లడానికి కొంతమేరకు భారం తగ్గిందనే విధంగా మరి కొంత మంది నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనాప్పటికీ పుష్ప-2 మేనియాతో ఈ ఏడాది అల్లు అర్జున్ తన హవా చూపించారని చెప్పవచ్చు. అలాగే పుష్-3 చిత్రాన్ని కంటిన్యూ ఉంటుందని చివరిలో చూపించారు.. అయితే ఇది ఇప్పుడే కాదని సుమారుగా ఆరేళ్ల తర్వాత జరిగే ఎక్కించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మరి ఇందులో ఎవరెవరు నటిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: