మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో త్రిష హీరోయిన్గా నటిస్తుండగా .... బింబిసారా ఫేమ్ మల్లాడి వశిష్ట ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీ ని తెరకెక్కిస్తూ ఉండగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాను మొదట వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
కానీ ఆ తర్వాత చిరంజీవి కుమారుడు అయినటువంటి రామ్ చరణ్ హీరో గా రూపొందిన గేమ్ చేంజర్ సినిమాను ఆ తేదీన విడుదల చేయాలి అని భావిస్తున్నట్లు దానితో గేమ్ చేంజర్ మూవీ ని ఆ తేదీ నుండి తప్పిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మే 9 వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ను మేకర్స్ ప్లాన్ చేసినట్లు , అందులో భాగంగా ఆ సాంగ్లో నటించడం కోసం మేకర్స్ శ్రీ లీల ను సంప్రదించినట్లు , కానీ ఆమె మాత్రం ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి నో చెప్పినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.
ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 2 సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. అలా ఈ ముద్దుగుమ్మ పుష్ప పార్ట్ 2 మూవీ లో స్పెషల్ సాంగ్ చేసి విశ్వంభర మూవీ లో స్పెషల్ సాంగ్ ఆఫర్ ను రిజెక్ట్ చేయడంతో మెగా అభిమానులు కాస్త డిసప్పాయింట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే పుష్ప పార్ట్ 2 లోని స్పెషల్ సాంగ్ ద్వారా శ్రీ లీల ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ లభిస్తుంది.