మండే టెస్ట్ లో పుష్పరాజ్ పాసవుతాడా.. సీమలో మాత్రం దారుణంగా కలెక్షన్లు?

Reddy P Rajasekhar
2024 సంవత్సరం ముగింపునకు మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ ఏడాది థియేటర్లలో విడుదలైన స్టార్ హీరోల సినిమాలన్నీ అంచనాలకు మించి విజయం సాధించాయి. డిసెంబర్ 4వ తేదీన విడుదలైన పుష్ప ది రూల్ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈరోజు సోమవారం కావడంతో పుష్ప ది రూల్ కలెక్షన్లు ఏ విధంగా ఉంటాయో అనే చర్చ జరుగుతోంది.
 
మండే టెస్ట్ లో పుష్పరాజ్ పాసవుతాడా అనే ప్రశ్న సైతం వ్యక్తమవుతోంది. రాయలసీమలో, ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం పుష్ప ది రూల్ కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవని సమాచారం అందుతోంది. ఈ ఏరియాలలో పుష్ప ది రూల్ బ్రేక్ ఈవెన్ కావడం కూడా కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టికెట్ రేట్లు కొన్ని ఏరియాలలో తగ్గినా తగ్గిన టికెట్ రేట్లు సైతం సామాన్య ప్రజలకు సైతం భారంగానే ఉండనున్నాయి.
 
టికెట్ రేట్లు 450 రూపాయలు, 395 రూపాయలు ఉండటం అంటే తక్కువ కాదనే చెప్పాలి. మల్టీప్లెక్స్ లలో ప్రస్తుతం టికెట్ రేట్లు ఈ స్థాయిలోనే ఉన్నాయి. పుష్ప ది రూల్ ఈ సినిమాలో నటించిన నటీనటులకు స్పెషల్ మూవీ అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. పుష్ప ది రూల్ ప్రమోషన్స్ లో వేగం పెంచితే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.
 
నాకు మంచి భవిష్యత్తు ఉంటుందని బన్నీ చెప్పారని ఈ సినిమాలో నటించిన పావని కరణం అనే నటి చెప్పుకొచ్చారు. పుష్ప2 మూవీ కలెక్షన్లు బన్నీ అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. పుష్ప ది రూల్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయగా రాబోయే రోజుల్లో ఈ సినిమా ఖాతాలో మరిన్ని రికార్డులు చేరే అవకాశం ఉంది. పుష్ప ది రూల్ కలెక్షన్ల పరంగా నార్త్ ఇండియాలో రికార్డులు క్రియేట్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: