సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్య కాలంలో ఎక్కువగా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఈయన నటించిన మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలలో శ్రీమంతుడు , భరత్ అనే నేను , మహర్షి సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. అలాగే ఈ మూవీ లోని మహేష్ నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి సూపర్ సాలిడ్ ప్రశంసలు కూడా వచ్చాయి. ఇకపోతే భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపించాడు. ఈ సినిమాలో కియార అద్వానీ , మహేష్ బాబు కి జోడిగా నటించగా ... కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందించాడు. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకొని అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసింది. ఇకపోతే ఈ సినిమాలో ఎడిటింగ్ లో కొన్ని సన్నివేశాలను తీసేసారట. ఆ సీన్స్ కనుక సినిమాలో ఉంచుకుంటే ఈ మూవీ రిజల్ట్ ఫ్లాప్ అయ్యేది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఆ సీన్ ఏది అనేది తెలుసుకుందాం. ఈ మూవీ లో మహేష్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని పల్లెటూర్లు తిరుగుతూ ఉండగా , ఒక చోట ఒక గర్భంతో ఉన్న మహిళను కలుస్తాడు. మహేష్ ఆమెతో ఎంత మంది పిల్లలు అని అడగ్గా ఆమె ముగ్గురు ఉన్నారు.
ఇది నాలుగవది అని అంటుంది. దానితో మహేష్ ఇంత మంది పిల్లల ... వీరిని చదివించి , ప్రయోజకులను చేయాలి అంటే డబ్బు ఖర్చు బాగా అవుతుంది. మరి మీకు అంత స్తోమత ఉందా అని అడిగి అక్కడ నుండి వెళతాడు. ఈ సీన్ బాగా వచ్చినా కూడా ఆ సన్నివేశాన్ని సినిమాలో ఉంచితే మూవీ రిజల్ట్ ఏమవుతుందో అనే ఉద్దేశంతో ఈ సన్నివేశాన్ని సినిమా నుండి తీసేసినట్లు తెలుస్తోంది.