రెచ్చిపోయిన నిహారిక.. ఆ హీరో బెడ్ రూమ్ లో ?

Veldandi Saikiran
మెగా కుటుంబం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి మొదటగా ఎలాంటి సపోర్ట్ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అనంతరం తన కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కానీ హీరోయిన్లుగా ఎవరిని పెద్దగా పరిచయం చేయలేదు. కేవలం నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక మాత్రమే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటగా ఈటీవీలో ప్రసారమైన డీ షోలో యాంకరింగ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఆ షో అనంతరం నిహారిక తన రూట్ పూర్తిగా మార్చేసింది. కొన్ని సినిమాలలో హీరోయిన్ గా చేసింది. కానీ ఆ సినిమాలేవి కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో నిహారిక సినిమాలకు దూరంగా ఉండి అనంతరం పలు వెబ్ సిరీస్ లలో నటించింది. కాగా, నిహారిక  ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు జొన్నలగడ్డ చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. ఇరు కుటుంబాల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది.

కొన్నాళ్లపాటు ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. ఈ జంటను చూసి చాలామంది మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేవారు. కొన్నాళ్ల అనంతరం ఏమైందో తెలియదు సోషల్ మీడియా వేదికగా విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. విడాకుల అనంతరం నిహారిక తన తండ్రి ఇంట్లోనే ఉంటుంది. ఇదిలా ఉండగా.... నిహారిక ప్రస్తుతం తమిళంలో "మద్రాస్ కారన్" సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ పాటను విడుదల చేశారు.

ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో నిహారిక ఓవైపు డ్యాన్స్ చేస్తూ, మరోవైపు హీరోతో రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయి నటించింది. బ్లాక్ కలర్ టాప్, షార్ట్ ధరించిన ఆమె థైస్ షో చూస్తూ అందరిని ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఆ పాట చూసిన వారంతా నిహారిక ఏంటి ఇంత బోల్డ్ గా నటించింది అంటూ నెగిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: