మహేష్ కోసం రెండు లారీల మల్లెపూలు .. సాంగ్ మొత్తం పూలతో నింపేసిన డైరెక్టర్ ఎవరు..?
మహేష్ బాబు తన కెరియర్ లో ఎన్నో ప్రయాగత్మక సినిమాలో నటించాడు .. వాటిలో కొన్ని సినిమాలు మాత్రమే సక్సెస్ అయ్యాయి .. మరి కొన్ని కనిపించకుండా పోయాయి. మహేష్ మురారి , ఒక్కడు , టక్కరి దొంగ , సైనికుడు , అతిథి .. ఆయన గతంలో సినిమా సినిమాకు ఎంతో డిఫరెంట్ గా కనిపించేవాడు. అయితే ఆయన చేసిన సినిమాల్లో డిఫరెంట్ ఫ్యామిలీస్ సబ్జెక్ట్ లలో మురారికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా మహేష్ కెరియర్ లోనే ఎంతో అద్భుతమని చెప్పాలి. ఇలాంటి క్యారెక్టర్ ఆయన చేయటం అదే తొలిసారి .
అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఆదరించారు ఈ సినిమాను .. కుటుంబమంతా కలిసి వెళ్లి సినిమా చూసి ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది మురారి .. అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ అందర్నీ కట్టి పడేస్తాయి . అయితే ఈ సినిమాలో ప్రతి సీన్ ప్రతి సాంగ్ ఎంతో అద్భుతంగా ఉంటుంది . అయితే ఈ సినిమాలో మహేష్ బాబు కోసం రెండు లారీల మల్లెపూలు వాడిన సందర్భం ఒకటి ఉందట. ఆ సందర్భం ఏంటో అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు .. ఈ సినిమాలు అందరికీ ఎంతో ఇష్టమైన పెళ్లి పాట .. మరీ ఈ పెళ్లి పాటను తరాల పాటు నిలిచిపోయేలా డైరెక్ట్ చేశారు కృష్ణవంశీ . ఈ సాంగ్ ఎంత అద్భుతంగా ఉంటుందో అందరికీ తెలుసు .. అయితే ఈ పాట కోసం ఏకంగా రెండు లారీల మల్లెపువ్వులు వాడారట దర్శకుడు .. ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో కృష్ణవంశీ స్వయంగా చెప్పారు . ఇక మురారి సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది. మహేష్ పుట్టినరోజు కానుకగా రీరిలీజ్‌లో కూడా అదిరిపోయే కలెక్షన్లు తెచ్చిపెట్టి మహేష్ క్రేజ్ ఏంటో చూపించింది.