ఫస్ట్ డే కలెక్షన్లు కొల్లగొటిన టాప్ - 10 ఇండియన్ సినిమాలు ఇవే.. !
1 - త్రిబుల్ ఆర్ :
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో మల్టీస్టారర్ సినిమాగా తెరకెక్కిన త్రిబుల్ ఆర్.. తొలి రోజు రూ.223.05 కోట్లు సాధించింది.
2 - బాహుబలి 2 :
ప్రభాస్, రానా, అనుష్క కాంబినేషన్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.214 కోట్లు సాధించింది.
3 - కల్కి :
ప్రభాస్, దీపికా పదుకొనే, కమలహాసన్ కాంబినేషన్లో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా.. తొలి రోజు రూ.182 కోట్లు కొల్లగొట్టింది.
4 - సలార్ :
ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రూ.165 కోట్లు సాధించింది.
5 - కే జి ఎఫ్ 2 :
యష్, సంజయ్ దత్ కాంబినేషన్లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. తొలిరోజు రూ.163 కోట్లు సాధించింది.
6 - లియో :
విజయ్, త్రిష జంటగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన లియో సినిమా తొలిరోజు రూ.142.8 కోట్లు సాధించింది.
7 - దేవర 1 :
ఎన్టీఆర్, జాన్వి కపూర్ జంటగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించిన ఈ సినిమాకు.. కొరటాల శివ దర్శకుడు. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ.145.2 కోట్లు వసూళ్లు సాధించింది.
8 - ఆదిపురుష్ :
ప్రభాస్, కృతి సనన్ కాంబినేషన్లో రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా.. తొలి రోజు రూ.136.8 కోట్లు సాధించింది.
9 - జవాన్ :
షారుఖ్ ఖాన్, నయనతార జంటగా.. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్ సినిమా.. తొలి రోజు రూ.129.2 కోట్లు సాధించింది.