టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా రాణిస్తున్న వారిలో శ్రీ లీల ఒకరు. పెళ్లి సందడి సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం వరుస పెట్టి సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. సీనియర్ హీరోయిన్లకు గట్టి పోటీని ఇస్తోంది. వయసుతో సంబంధం లేకుండా జూనియర్, సీనియర్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్క హీరోల సినిమాలలో నటించి మంచి గుర్తింపు అందుకుంటుంది. ఇక ఈ వారం శ్రీ లీల స్పెషల్ సాంగ్ లో నటించిన పుష్ప2 సినిమా విడుదల అయింది.
అందులో శ్రీ లీల అందాల ఆరబోతకు అభిమానులు ఫిదా అవుతున్నారు. శ్రీ లీల కెరీర్ లో ఐటమ్ సాంగ్ చేయడం ఇదే మొదటిసారి, ఇదే చివరిసారి కావచ్చు అని కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దానికి గల కారణం స్పెషల్ సాంగ్స్ లలో చేయడం ఈ బ్యూటీకి పెద్దగా ఇష్టం లేదట. శ్రీ లీల ఐటమ్ సాంగ్ లకు మాత్రమే దూరంగా ఉండాలని భావిస్తోందట. స్పెషల్ సాంగ్ లో నటించిన హీరోయిన్లకు ఆ పాట కనక హిట్ అయితే అనంతరం ఐటెం సాంగ్ లలో నటించే అవకాశాలే ఎక్కువగా వస్తాయి.
కానీ తక్కువ సమయంలోనే వారి కెరియర్ కూడా ముగుస్తోంది. ప్రతి ఒక్కరు ఐటమ్ గర్ల్ అని పిలుస్తారు. ఈ బ్రాండ్ వేసుకోవడం శ్రీ లీలకు ఏమాత్రం ఇష్టం లేదట. పుష్ప 2 సినిమాకి ముందు కూడా కొన్ని ఐటమ్ సాంగ్ లలో నటించే అవకాశం వచ్చినప్పటికీ శ్రీ లీల చాలా కూల్ గా చేయను అని చెప్పిందట. మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభరా సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించమని శ్రీ లీలకు ఆఫర్ వచ్చిందట.
కానీ ఈ బ్యూటీ ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందట. కేవలం అల్లు అర్జున్ తో కలిసి డ్యాన్స్ చేయాలనే కోరికతోనే శ్రీ లీల ఇందులో నటించడానికి ఒప్పుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. దీంతో ఒక్కసారిగా చిరంజీవి అభిమానులు ఈ విషయం తెలిసి బాధపడుతున్నారట. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించే అవకాశం వస్తే రిజెక్ట్ చేసిందని నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు.