తెలుగు ఇండస్ట్రీలోని ప్రముఖ ఫ్యామిలీలలో నందమూరి ఫ్యామిలీ మొదటి స్థానంలో ఉంది. ఎన్టీఆర్ వారసులుగా చాలా మంది నందమూరి హీరోలు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. బాలకృష్ణ మంచి గుర్తింపుతో దూసుకుపోతున్నాడు. తర్వాత ఆయన వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారిలో జూనియర్ ఎన్టీఆర్ స్టార్ అయ్యాడు. తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి ఎన్టీఆర్ ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డారు.ఇదిలావుండగా నందమూరి ఫ్యామిలీకి జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య కాస్త గ్యాప్ ఉందని ఫ్యాన్స్ చాలా కాలంగా భావిస్తున్నారు. ఆ విషయంలో చాలా రూమర్స్ కూడా ఉన్నాయి.కానీ సందర్భం వచ్చినప్పుడల్లా జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబ సభ్యులతో కలుస్తూనే ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ ని బాలకృష్ణ చాలా సందర్భాల్లో అభినందించారు. అయితే తొలిసారి తారక్ నటనని బాలయ్య మెచ్చుకున్న సందర్భం ఒకటి ఉంది.
అదేమిటంటే స్టూడెంట్ నెం.1 వంటి హిట్ సినిమాతో ఇండస్ట్రీకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చినా అతనిలో మాస్ హీరోను బయటకు తెచ్చింది మాత్రం డైరెక్టర్ వి.వి వినాయక్. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఆది సినిమా ఓ సెన్సెషన్ క్రియేట్ చేసింది. 2002 సంవత్సరంలో ఫ్యాక్షనిజం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ మూవీ ఎన్టీఆర్ కెరీర్‌ను తారాస్థాయిలో నిలబెట్టడమే కాకుండా నందమూరి నట వంశానికి అసలైన వారసుడు వచ్చాడంటూ కీర్తి తెచ్చిపెట్టింది.ఈ క్రమంలో ఆది మూవీ బాలయ్య స్వయంగా అడిగి ప్రసాద్ ల్యాబ్స్ లో స్పెషల్ షో వేయించి మరిచూసారు.బాలయ్య సినిమా చూశాక వెంటనే జూనియర్ ఎన్టీఆర్ కి ఫోన్ కలపండి అంటూ అసిస్టెంట్స్ ని అడిగారు. ఫోన్ చేసి ఎన్టీఆర్ ని అభినందించారు. ఆ టైంలో ఎన్టీఆర్ అల్లరి రాముడు షూటింగ్ లో ఉన్నారు. రేయ్ బాగ చేశావ్ రా బ్రహ్మాండంగా ఉంది. టాప్ పెర్ఫార్మెన్స్ కంగ్రాట్స్ అని అభినందించారు.ఈ నేపథ్యంలో బాలకృష్ణ కల్మషం లేని వ్యక్తి అంటూ చాలా మంది ప్రశంసలు కురిపించారు.