వామ్మో: రెండు రోజులకే అరాచకం సృష్టించిన పుష్ప రాజ్..ఎంతంటే..?

Divya
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 చిత్రం నిన్నటి రోజున బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.. ఈ సినిమా మొదటిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టి సరికొత్త రికార్డులను తిరగరాసింది. అల్లు అర్జున్, రష్మిక యాక్టింగ్ కి సైతం ప్రశంసలు అందుకున్నారు .డైరెక్టర్ సుకుమార్ టేకింగ్ కూడా అద్భుతంగా ఉన్నదట.  రెండవ రోజు ఈ సినిమా ఎంతటి కలెక్షన్స్ రాబట్టింది అనే విషయం పైన ఇటీవల చిత్ర బృందం అఫీషియల్ గా ఒక పోస్ట్ ని రిలీజ్ చేసింది.

పుష్ప-2 సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.449 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టిందట. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక ప్రత్యేకమైన పోస్టర్ని రిలీజ్ చేశారు.. ఇండియన్ సినీ చరిత్రలోని రెండు రోజులలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసిందంటూ టీమ్ తెలియజేసింది. ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ అభిమానుల సైతం ఆనందాన్ని తెలియజేస్తున్నారు.. మరి కేవలం మూడు రోజుల్లోనే రూ .500 కోట్ల కబ్లో చేరడం ఖాయమని అభిమానుల సైతం ధిమా చేస్తున్నారు.

ఒకవేళ ఇదే జోరు కంటిన్యూ అయితే వారం రోజుల లోపే ఈ సినిమా  రూ.1000 కోట్ల క్లబ్లో చేరుతుందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా చూసిన చాలా మంది ప్రేక్షకులు నటీనటులు డైరెక్టరులు సైతం ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు.. అల్లు అర్జున్ చేశారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. ఇందులో జగపతిబాబు, అనసూయ, సునీల్, రావు రమేష్ తదితర నటి నటుల సైతం నటించారు.. శ్రి లీల స్పెషల్ సాంగులో అదరగొట్టేసింది. మరి ఏ మేరకు రూ .1000 కోట్ల క్లబ్లో ఎన్ని రోజులకు చేరుతుందో చూడాలి మరి. పుష్ప-3 రాంపేజ్ ఉంటుంది అనే విధంగా సినిమా చివరిలో డైరెక్టర్ సుకుమార్ హింట్ ఇచ్చారు.. మరి ఇది ఎప్పుడు అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: