పుష్ప 3 : చాలా పెద్ద కధ సామి.. సుకుమార్ ఎలా డీల్ చేస్తాడో..?

murali krishna
ప్రస్తుతం పాన్ ఇండియా వ్యాప్తంగా పుష్పరాజ్ మేనియా నడుస్తోంది. అన్ని భాషల్లో పుష్ప-2 మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే పుష్ప-3 గురించి కూడా చర్చ జరుగుతోంది.రిలీజ్ కు ముందే పార్టు-3 గురించి హింట్ ఇచ్చారు.పుష్ప 3 ర్యాంపేజ్ ఎప్పుడొస్తుందో తెలియదు కానీ.. ఆల్రెడీ థియేటర్స్‌లో అల్లు అర్జున్ ర్యాంపేజ్ అయితే మొదలైపోయింది. ప్రీమియర్స్ నుంచే పూనకాలు పుట్టిస్తున్నాడు పుష్ప రాజ్.ఇంటా బయటా అని తేడాలేదు.. అన్ని చోట్లా మోత మోగిస్తుంది పుష్ప 2. సౌత్ మాత్రమే కాదు.. నార్త్‌లోనూ తన నట విశ్వరూపంతో రికార్డుల జాతర చూపిస్తున్నారు బన్నీ. పుష్ప 2విషయంలో ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు.. కాలర్ ఎగరేస్తున్నారు. ఇప్పుడున్న దూకుడు చూస్తుంటే వీకెండ్ అయ్యేలోపే 1000 కోట్ల మ్యాజిక్ ఫిగర్ చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.అంతా బానే ఉన్నా.. కొన్ని ప్రశ్నలు మాత్రం అభిమానులను వేధిస్తున్నాయి. పార్ట్ 3 కోసం వాటిని అలాగే దాచేసారు సుకుమార్. ట్రైలర్‌లో వచ్చిన కొన్ని షాట్స్ సినిమాలో కనిపించలేదు. జపాన్‌లో కొందరితో బిజినెస్ డీల్స్ చేస్తాడు పుష్ప.. అలాగే అక్కడ మరికొన్ని సీన్స్ కూడా ఉంటాయి.అవేవీ పార్ట్ 2లో కనిపించలేదు. దాంతో పాటు పుష్పపై జాలిరెడ్డి గన్ ఎక్కుపెట్టిన సీన్ సైతం సినిమాలో లేదు. అదొక్కటే కాదు.. జపాన్ ఎపిసోడ్ సైతం సడన్‌గా కట్ చేసారు సుక్కు.

రెండేళ్ళ కింద రిలీజ్ చేసిన Where Is pushpa టీజర్‌లోని ఒక్క షాట్ కూడా పుష్ప 2 రూల్‌లో లేదు.ఇవి మాత్రమే కాదు.. ఇంకా చాలా ప్రశ్నలు అలాగే వదిలేసారు లెక్కల మాస్టారు. వీటన్నింటికీ ఒకేసారి పార్ట్ 3లో ఆన్సర్ ఇవ్వబోతున్నారు సుకుమార్. నెక్ట్స్ రామ్ చరణ్‌తో సినిమా కమిటైన సుక్కు.. పుష్ప 3 ర్యాంపేజ్ ఎప్పుడు మొదలుపెడతారనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు.ఈ క్రమంలో పుష్ప 1 ఇచ్చిన బూస్టింగ్ తో 3 ఏళ్లు టైం తీసుకుని పుష్ప 2 ని తెరకెక్కించిన డైరెక్టర్ సుకుమార్ సినిమా ప్రేక్షకుల అంచనాలకు రీచ్ అవ్వడంలో సక్సెస్ అయ్యాడు.ఐతే పుష్ప 1 తర్వాత పుష్ప 2 మొదలు పెట్టాడు కానీ పుష్ప 3 మాత్రం అలా కాకుండా అటు సుకుమార్ ఇటు అల్లు అర్జున్ వేరే సినిమా చేస్తారని తెలుస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం 2026 ఎండింగ్ లో లేదా 2027 లో అలా మొదలు పెట్టి 2030కి పుష్ప 3 రిలీజ్ చేసేలా ప్లాన్ ఉందట. మరి పుష్ప 3 2030 అంటే అల్లు అర్జున్ రెండు సినిమాలు చేసే ఛాన్స్ ఉంది.ఇక పార్ట్ 2 కన్నా పార్ట్ 3 మరింత భయంకరంగా ఉంటుందని తెలుస్తుంది. ఐతే పుష్ప 3 మీద కూడా భారీ అంచనాలు ఉంటాయి. మరి సుకుమార్ ఈసారి ఏం చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: