పుష్ప2 సూపర్ డూపర్ హిట్ ..కానీ సంతోషంగా లేని బన్నీ ..ఎందుకంటే..?
పుష్ప 2 సినిమా సూపర్ డూపర్ హిట్ . బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కానీ బన్ని సంతోషంగా లేడు . దానికి రీజన్ పుష్ప2 సినిమా చూడడానికి వస్తున్న జనాలు కొంతమంది గొడవలు పడడం అదేవిధంగా సంధ్య థియేటర్లో రేవతి అనే మహిళ మృతి చెందడం సినిమాకి బాగా నెగిటివ్ గా మారిపోయింది . సూపర్ డూపర్ హిట్ టాక్ వచ్చినా కలెక్షన్స్ బాగానే వచ్చినా ఎక్కడో పుష్ప సినిమాపై ఒక నెగిటివ్ ఫీలింగ్ కూడా కలుగుతుంది .
మరి ముఖ్యంగా కొంతమంది ఫ్యాన్స్ రేవతి మృతిని తమ స్వార్థం కోసం వాడేసుకుంటున్నారు . అంతేకాదు బన్నీని అరెస్ట్ చేయాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. బన్నీ ఎంతో కష్టపడి నటించాడు . ఆ సినిమా హిట్ అయింది కానీ ఆ సినిమా హిట్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నాడు అంటూ బన్నీ ఫ్యాన్స్ కూడా బాధపడిపోతున్నారు. అంతేకాదు చాలామంది టాలీవుడ్ స్టార్ హీరోస్ పుష్ప2 సినిమాపై అస్సలు రియాక్ట్ అవ్వలేదు . బన్నీ ఫాన్స్ అని చెప్పుకునే హీరోలు కూడా బన్నీ సినిమాపై రియాక్ట్ కాకపోవడం బన్నీ అభిమానులకు మండిపోయేలా చేస్తుంది.