గేమ్ ఛేంజర్: సక్సెస్ కోసం టాలీవుడ్ హీరోయిన్ పూజలు..!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిగా సాంప్రదాయమైన పద్ధతిలో హీరోయిన్గా పేరు సంపాదించింది హీరోయిన్ అంజలి.. మొదట తమిళ సినిమాతో పరిచయమైనప్పటికీ తెలుగులో మంచి చిత్రాలలో అద్భుతమైన పాత్రలలో నటించి భారీ పాపులారిటీ అందుకుంది. ముఖ్యంగా సెకండ్ హీరోయిన్ గా పులుచిత్రాలలో నటించింది.. తమిళంలో షాపింగ్ మాల్ అనే సినిమా ద్వారా పేరు సంపాదించుకున్న ఈ అమ్మడు తెలుగులో ఈ సినిమా డబ్బింగ్ అయ్యి మంచి హిట్ టాక్ సంపాదించుకుంది.. ఆ తర్వాత జర్నీ సినిమాతో పేరు సంపాదించిన అంజలి హీరోయిన్ గా కూడా పలు సినిమాలలో నటించింది.

SVSC చిత్రంలో నటించిన అంజలికి మంచి క్రేజ్ పెరిగింది. ఆ తర్వాత ఈ ఆమ్మడు నటించిన చిత్రాలు పెద్దగా మెప్పించలేకపోయాయి.. పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్లలో కూడా నటించింది. అటు తెలుగు, తమిళ భాషలలో నటిస్తున్న అంజలి ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రంలో కూడా రామ్ చరణ్ భార్యగా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ సినిమా సక్సెస్ కోసం అంజలి రాయలసీమలోని కడప అమీర్పేట దర్గాను దర్శించుకున్నట్లు సమాచారం.

దర్గాకు విచ్చేసిన హీరోయిన్ అంజలికి సైతం భారీ ఘన స్వాగతం పలికినట్లు సమాచారం అంజలి దర్గాలు ప్రత్యేకమైన పూజలు ప్రార్థనలు కూడా చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అనంతరం మాట్లాడుతూ తను ఈ దర్గాకి రావడం మొదటి సారి అని.. ఇక్కడికి రావడం తనకు చాలా ఆనందంగా ఉందని దర్గాను దర్శించుకోవడం వల్ల తనకు కొంత మనశాంతి కలిగిందని తెలియజేసింది.. అలాగే తాను నటించిన ఏం చేంజెస్ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతోంది ప్రేక్షకులు అందరూ కూడా ఆదరించండి అంటు తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి గేమ్ చేంజర్ సక్సెస్ కావాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: