పుష్ప2లో అల్లు అర్జున్ కూతురుగా నటించిన ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా .. బయట మామూలుగా లేదు బాసు..!

Amruth kumar
ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 దూసుకుపోతున్న విషయం తెలిసిందే.. చిత్తూరు యాసలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్ తో అభిమానులు పూనకాలు తెప్పిస్తున్నాయి. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ అన్న కూతురుగా కావేరి పాత్రలో ఓ అమ్మాయి నటించి ఇరగదీసింది. ఆ అమ్మాయి పాత్ర కారణంగా కథ‌ మలుపు తిరుగుతుంది .. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అనేది ఇక్కడ చూద్దాం. పుష్ప2 ఫీవర్ భారత దేశంలో మామూలుగా లేదు .. ప్రస్తుతం ఇండియాలో ఉన్న ఏ ఒక్క థియేటర్లో కూడా సీట్లు ఖాళీగా ఉన్నాయని మాటే ఎక్కడా వినిపించడం లేదు .. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ ఇండియాలోనూ పుష్ప2 లక్షల సునామి మామూలుగా లేదు .. మూడు సంవత్సరాల సుదీర్ఘ టైం తర్వాత అల్లు అర్జున్ ను స్క్రీన్ పై చూసి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

అలాగే పుష్ప 2లో అల్లు అర్జున్ నటన మరో లెవల్లో ఉందని కూడా చెప్పవచ్చు .. హీరోయిన్గా రష్మిక మందన్న‌, మిగిలిన పాత్రలో ఫహాద్ ఫాజిల్ , జగపతిబాబు , రావు రమేష్ వంటివారు ఎంతో అద్భుతంగా నటించారు. అలాగే ఈ సినిమాను ఊహించని మలుపు తిప్పే పాత్రలో ఒక అమ్మాయి నటించింది .. అల్లు అర్జున్ అన్న అజయ్ కూతురుగా పుష్పను చిన్నాన్న చిన్నాన్న అను పిలుస్తూ ఒక పాత్ర ఉంటుంది. ఇక ఆ పాత్రలో నటించింది మరి ఎవరో కాదు.. ఆమె పావని కరణం .. పుష్ప మొదటి భాగంలో కాసేపు కనిపించింది ఈ అమ్మాయి .. అయితే తాజాగా విడుదలైన పుష్ప 2 లో మాత్రం ఈమె పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది .. ఈమె పాత్రతోనే సినిమా కథ ఊహించని మలుపు తిరుగుతుంది .. క్లైమాక్స్ ఫైట్ కూడా ఈమె గూరించే మరో లెవల్ లో ఉంటుంది.

ఇక పావ‌ని పుష్పలోనే నటించలేదు మొదట షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ను మొదలుపెట్టిన‌ ఈ ముద్దుగుమ్మ ఆ పై సినిమాల్లో అడుగుపెట్టింది .. పావని కరణం తెలుగులో పరేషాన్ , పైలం పిల్లగా సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది .. పరేషాన్ సినిమాతో మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది. ప్రధానంగా పరేషాన్ సినిమాలో సమోసా తింటూ శిరీష అనే డైలాగ్ ద్వారా ఎంతో ఫేమస్ అయింది పావని. అలాగే అడివి శేష్‌ హీరోగా వచ్చిన హిట్ సినిమాలో కూడా కీలకపాత్రలో కనిపించింది పావని . ఇక రీసెంట్ గా వచ్చిన గాడ్స్ ఆఫ్ ధర్మపురి అనే వెబ్ సిరీస్ లో కూడా ఈమె నటించింది. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమా తర్వాత ఈ అమ్మాయి ఎవరో తెలుసుకునేందుకు నెటిజన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. డిఫరెంట్ ఫోటోలతో హాట్ హాట్ ఫోజుల్లో ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది .. అలాగే తన సినిమాలు కు సంబంధించిన పోస్టులు కూడా పెడుతూ ఉంటుంది .. అలా పావని సోష‌ల్‌ మీడియాలో కూడా హాట్ గానే ఉంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: