గోవిందుడు అందరివాడేలే: తొక్కిసలాటలో చరణ్ ఫ్యాన్ మృతి..భారీ సాయం ?

Veldandi Saikiran
రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన రామ్ చరణ్ తన అద్భుతమైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. మొదట రామ్ చరణ్ సినిమాలు కాస్త సక్సెస్ కానప్పటికీ ప్రస్తుతం రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు. రామ్ చరణ్ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించాడు. అందులో గోవిందుడు అందరివాడేలే సినిమా ఒకటి. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ సినిమాకు కృష్ణ వంశీ దర్శకత్వం వహించగా, బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించాడు.

ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. శ్రీకాంత్, కమలిని ముఖర్జీ, ప్రకాష్ రాజ్, జయసుధ వంటి వారు కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమా 2014 అక్టోబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే గోవిందుడు అందరివాడేలే సినిమా రిలీజ్ సమయంలో ఏపీలోని ఎమ్మిగనూరులో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో కన్నయ్య అనే వ్యక్తి మృతి చెందాడు.

ఈ సినిమా రిలీజ్ అయిన రోజున కన్నయ్య అనే వ్యక్తి మృత్యువాత పడ్డారు. దీంతో కన్నయ్య కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థిక సహాయాన్ని రామ్ చరణ్ అందించాడు. అంతేకాకుండా తన కుటుంబానికి అండగా నిలుస్తానని వెల్లడించాడు. కాగా, రీసెంట్ గా పుష్ప2 సినిమా ప్రీమియర్ షోలో రేవతి అనే మహిళా మృతి చెందిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ని చూడడానికి వచ్చిన ఈ మహిళా తొక్కిసలాటలో మృతి చెందింది. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు.

కాగా, రేవతి మహిళా మృతి చెందడంతో అల్లు అర్జున్ రేవతి కుటుంబ సభ్యులకు రూ. 25 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించాడు. అంతేకాకుండా రేవతి పిల్లలకు ఎలాంటి సహాయం చేయడానికి అయినా ఎప్పుడూ అండగా నిలుస్తానంటూ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో అనౌన్స్ చేశాడు. రేవతి మరణ వార్త విన్న వెంటనే తాను చాలా బాధపడ్డానని అల్లు అర్జున్ అన్నాడు. పుష్ప2 సినిమా సెలబ్రేషన్స్ లో కూడా చురుగ్గా పాల్గొనలేకపోయానని అల్లు అర్జున్ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: