పుష్ప 2 : అల్లు అర్జున్‌ దెబ్బకు ఆ బాలీవుడ్‌ హీరో రికార్డ్‌ బద్దలు..!

Veldandi Saikiran
అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ పుష్ప-2. ఎక్కడ చూసిన పుష్ప రాజ్ హవా కొనసాగుతోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషలలో విడుదలై సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో రోజులుగా ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూసిన పుష్ప-2 సినిమా థియేటర్లోకి రావడంతో అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. పుష్ప-1 కు మించి ఈ సినిమా ఉండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక పుష్ప-2 సినిమా సక్సెస్ కావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. పుష్ప-2 మొదటి రోజే భారీగా వసూళ్లను రాబట్టింది. అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన ఈ సినిమా అన్ని భాషలలో విజయాన్ని నమోదు చేసుకుంటుంది. ముఖ్యంగా డాన్సింగ్ క్వీన్ శ్రీ లీల అద్భుతంగా స్టెప్పులు వేసింది. ప్రస్తుతం శ్రీ లీల స్టెప్పులు వేసిన ఈ పాట సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.

కాగా, పుష్ప-2 ప్రీమియర్ షోల నుంచి ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజు పుష్ప సినిమా ఎంత కలెక్షన్లు రాబట్టిందని తెలుసుకోవడానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా, మొదటి రోజు వసూళ్లతో పుష్ప-2 అన్ని రికార్డులను కొల్లగొట్టింది. ఇప్పటికీ ఓపెనింగ్ రోజున నైజాం ఏరియాలో ఈ సినిమా రూ. 30 కోట్లకు పైనే రాబట్టి.... ఆర్ఆర్ఆర్ పైన ఉన్న రికార్డులను క్రాస్ చేసింది.

తాజాగా ఈ సినిమా మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుందని టాక్ వినిపిస్తోంది. జవాన్ మొదటి రోజు రూ. 65 కోట్లు వసూళ్లను రాబట్టగా.... పుష్ప-2 రూ. 67 కోట్లతో రికార్డులను బీట్ చేసిందని సమాచారం అందుతుంది. దీని ప్రకారం పుష్ప-2 బాక్సాఫీస్ రికార్డులను క్రాస్ చేస్తుందని సినీ విశ్లేషకులు చెప్పకనే చెబుతున్నారు. ఈ విషయం తెలిసి అల్లు అర్జున్ అభిమానులు సంతోషపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: