పుష్ప 2 లో అంత మంచి ఎలివేషన్ సీన్స్ .. దాచారా? తీసేశారా ?
మూవీలో ఆ సీన్స్ కూడా ఉండి ఉంటే సినిమా మరో లవర్ లో ఉండేది అంటూ అభిమానులు కూడా వాటి గురించి మాట్లాడుకుంటున్నారు . ఎంతో కష్టపడి తెరకెక్కించి అంత కష్టపడి ప్రమోట్ చేసిన ఆ సీన్స్ ఎందుకు సినిమాలో తీసేసారు అనే ప్రశ్న గట్టిగా వినిపిస్తుంది. అయితే దీనికి రెండు ఆన్సర్లు బయటకి వచ్చాయి .. వాటిని తీసేశారని , మరొకటి దాచారని అంటున్నారు. అలాగే తిరుపతి జైలు నుంచి బుల్లెట్ గాయం తో పుష్ప తప్పించుకున్నాడు అంటూ రిలీజ్ చేసిన ఆ ఆడియో విషయంలో చిన్నపాటి నెగిటివిటీ కూడా వచ్చింది. పుష్ప ఎర్రచందనం ద్వారా సంపాదించిన డబ్బులను జనాలకి పంచి పెట్టినట్టు చూపించిన సీన్స్ వల్ల సినిమా కథ మొత్తం మారిపోతుందని కొందరు అన్నారు .
ఈ విషయం ఏమైనా చిత్ర యూనిట్ వరకు వెళ్లిందా అందుకే తీసేశార అని కూడా కొందరు అంటున్నారు. ఇక మరికొందరు పుష్ప 2 సినిమా క్లైమాక్స్ లో బాంబు పేలిన తర్వాత పుష్ప పోలీసులకు లోగిపోతాడని అక్కడి నుంచి భార్యతో కలిసి తప్పించుకుని అడవిలోకి వెళ్లి తన ర్యాంపేజ్ చూపిస్తాడని కూడా అంటున్నారు. అయితే వీటిలో ఏది నిజమో తెలియదే కానీ మంచి హైప్ ఇచ్చే సీన్స్ అయితే మిస్ అయ్యాం .. నిజానికి ఆ సీన్సే కాదు జపాన్లో డీల్ చేసే సీన్ కూడాా మిస్ అయ్యాం. మరి పుష్ప 3ని ఎలా చూపిస్తారో చూడాలి.