దుల్కర్ తో చేస్తే హీరోయిన్లకు అలా కలిసొస్తుందా.. నెక్స్ట్ పూజ అనే..!
మహానటి మూవీ సావిత్రి బయోపిక్ అయిన కీర్తి సురేష్ ఎంతో హైలెట్ అయింది .. అమ్మాడి అమ్మాడి అంటూ ఫుల్ క్రెడిట్ కొట్టేసాడు దుల్కర్ సల్మాన్ . ఆయన పక్కన నటిస్తుంటే హీరోయిన్లు స్క్రీన్ మీద మరింత గ్లోరిఫై అవుతున్నారని ఇండస్ట్రీ లో ఉన్న వారి మాట . సీతారామం లో మృణాల్ ఠాకుర్ కి కూడా అంతే స్క్రీన్ స్పేస్ వచ్చింది . అంతేకాకుండా సీతారామం జంట ని మళ్లీ మళ్లీ వెండి తేర మీద చూడాలని కోరుకున్న వారు కోట్లలో ఉన్నారు . అంత గా తమ నటన తో మెప్పించింది దుల్కర్ , మృణాల్ కెమిస్ట్రీ .. ఇక రీసెంట్ గా వచ్చిన లక్కీ భాస్కర్ లోను మీనాక్షి చౌదరి కి కూడా అలాంటి క్రేజ్ ఇచ్చాడు దుల్కర్ . ఈ సినిమాలో ఇద్దరూ భార్యాభర్తలు గా నటించారు .. ప్రతి సన్నివేశం లో ఒకరిని మించి మరొకరు నేచురల్ గా అదరగొట్టారు .
ఇక ఇప్పుడు త్వరలో నే ఈ లక్కీ ఛాన్స్ పూజ హెగ్డే కి రాబోతుందని ఫిలిం సర్కిల్స్ లో ఓ న్యూస్ బయటకు వచ్చింది . ఓ కొత్త డైరెక్టర్ చెప్పిన కథకు దూల్కర్ ఓకే చెప్పారట అందులో పూజ హెగ్డే హీరోయిన్గా కన్ఫర్మ్ చేయబోతున్నారట. ఇదే జరిగితే చాలా ఏళ్లుగా తెలుగులో రియంట్రీ కి ట్రై చేస్తున్న పూజ హెగ్డే కి లక్కీ ఛాన్స్ అవుతుందంటూ ఆనందపడుతున్నారు ఫాన్స్.