పుష్పతో నా కెరీర్ కి ఒరిగిందేమి లేదు.. ఫహాద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్..!!

murali krishna
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ - అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన 'పుష్ప' ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి ఆదరణ పొందిందో తెలిసిందే. 2021 లో వచ్చిన ఈ మూవీ ఇండియన్ సినిమాలో ఓ సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ఈ మూవీతోనే బన్నీ, సుకుమార్, రష్మిక పాన్ ఇండియా స్టార్స్ గా మారారు.మలయాళ హీరో ఫాహద్ ఫాజిల్ ఈ సినిమాతోనే టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. సినిమాలో భన్వర్ సింగ్ షికావత్ పాత్రలో తన నటనతో అదరగొట్టేసాడు. 'పుష్ప' కంటే ముందు మలయాళ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా ఉన్న ఫాహద్.. పుష్ప తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే ఫహద్ ఫాజిల్ మాత్రం పుష్ప వల్ల తనకు ఒరిగిందేమి లేదని షాకింగ్ కామెంట్స్ చేశాడు.రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఫహాద్ కి పుష్ప తర్వాత పాన్ ఇండియా యాక్టర్ గా మారారని కాంప్లీమెంట్స్ వస్తున్నాయి కదా! దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అనే ప్రశ్న ఎదురయింది. దానికి ఈ మలయాళ హీరో ఇచ్చిన ఆన్సర్ అందరినీ షాక్ కి గురి చేసింది. " పుష్ప సినిమా నా కెరీర్ కి పెద్దగా ఉపయోగపడలేదు. ఈ విషయం సుకుమార్ సార్ కి కూడా చెప్పాను.
ఇందులో నేనేం దాచడం లేదు. అలా అని అబద్దం కూడా చెప్పట్లేదు. ఆ సినిమా తర్వాత నేను ఎక్కువగా మలయాళ సినిమాల్లోనే నటించాను. మలయాళం భాష తెలియని వాళ్ళు కూడా నా సినిమాలు చూస్తున్నారు. అదొక్కటే నాకు ఆనందాన్ని కలిగించింది" అని అన్నాడు. పుష్ప లాంటి పాన్ ఇండియా సినిమా వల్ల తనకు ఎలాంటి లాభం చేకూరలేదని ఫహద్ ఫాజిల్ చెప్పడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే.ఈ క్రమంలోనే పుష్ప 2 సినిమాలో అందరి క్యారెక్టర్స్ కంటే.. భన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ పైనే ఫ్యాన్స్ అందరి దృష్టి పడింది. మొదటి పార్ట్ లో ఫహాద్ పాత్ర ఎంత అయితే ఉందో సెకండ్ పార్ట్ లో కూడా అంతే ఉందని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. అసలు మెయిన్ విలన్ ఫహాద్ నే అని అనుకున్నవారు నిరాశకు గురి అయ్యారు.సినిమా మొత్తంలో అక్కడక్కడా వీరిద్దరి మధ్య పగను చూపించారు కానీ, కథ మొత్తం వేరే నడిచింది. శ్రీవల్లి చెప్పిన మాట కోసం.. రావు రమేష్ ను సీఎం చేయడానికి పుష్ప ఏం చేశాడు అనేదే పుష్ప 2 కథ. ఇక ఇందులో భన్వర్ సింగ్ పాత్ర అంతంత మాత్రంగానే ఉంది. ఉన్నంతసేపు కూడా ఫహాద్ తన నటనతో మెప్పించాడు.అయితే ఈ మాత్రం దానికోసమేనా ఇన్నేళ్లు ఎదురుచూసింది. ఫహాద్ మ్యాజిక్ చేస్తాడు అనుకున్నాం.. అసలు ఎంట్రీ వచ్చింది పోయింది కూడా తెలియలేదు అని ట్రోల్స్ మొదలయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: