రాజమౌళి భయపడిందే జరిగిందా.. పుష్ప తో సుకుమార్ మాస్ ర్యాంప్ ఆడించాడుగా..!!

murali krishna
దర్శక ధీరుడు రాజమౌళి సినిమా వస్తుందంటే చాలు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ అంతా అలెర్ట్ అవుతారు..ఆయన తెరకెక్కించే సినిమాలు ఓ రేంజ్ లో ఉంటాయి . వేల కోట్ల కలెక్షన్స్ కొల్లగొడతాయి.. ఇండస్ట్రీ లో తనకి పోటీ ఇచ్చే దర్శకులే లేరు.అయితే దశాబ్ద కాలం క్రితం రాజమౌళి తనకు పోటీ ఇచ్చే దర్శకుల గురించి ఓ మాట చెప్పారు.ఇండస్ట్రీ లో నాకు బాగా పోటీని ఇచ్చే దర్శకులు ఇద్దరున్నారు..వారు ఎవరో కాదు త్రివిక్రమ్ మరియు సుకుమార్ అని ఆయన చెప్పుకొచ్చారు.. వారు కనుక కాన్సంట్రేషన్ చేసి మాస్ సినిమాలు తెరకెక్కిస్తే మనం సర్దుకోవాల్సిందే అని భయం నాకు ఉంది.మా అదృష్టం కొద్ది వాళ్లు ఫుల్‌ఫ్లెడ్జ్‌ మాస్ మసాలా సినిమా తీయడం లేదని రాజమౌళి అన్నారు.కానీ అప్పుడు రాజమౌళి చెప్పిందే.. ఇప్పుడు నిజం అవుతుంది..ఇప్పటి వరకు సుకుమార్ చేసిన ఊరమాస్ సినిమా ఏదంటే ప్రేక్షకులు ఆలోచించకుండా చెప్పే సినిమా పేరు పుష్ప2..

దర్శకుడు సుకుమార్ తన సెకండ్ సినిమా ‘జగడం’తోనే మాస్ మూవీ తీసాడు... కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. దీంతో.. క్లాస్ సినిమాలు చేస్తు వచ్చిన సుక్కు.. రంగస్థలం నుంచి యూటర్న్ తీసుకున్నారు.. పుష్ప పార్ట్ 1ని మాస్ శాంపిల్ అనేలా చేసిన లెక్కల మాస్టారు.. ఇప్పుడు పాన్ ఇండియా షేక్ అయ్యే ఊర మాస్ మూవీ తీసి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు...పుష్ప 2 సినిమాలో.. ముఖ్యంగా సెకండాఫ్‌లో ప్రతీ ఫ్రేమ్ కూడా సుకుమార్ ఇచ్చిన హైకి ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది. మరీ ముఖ్యంగా జాతర ఎపిసోడ్‌ పీక్స్ లెవెల్ లో ఉంటుంది... క్లైమాక్స్‌ ఫైట్ అయితే సామాన్య ప్రేక్షకుడి సైతం గూస్ బంప్స్ వచ్చే రేంజ్ లో ఉంటుంది. సుకుమార్ అదిరిపోయే టేకింగ్‌కు అల్లు అర్జున్ నటవిశ్వరూపం చూపించాడు. ఒక్క బన్నీ మాత్రమే కాదు సినిమాలో నటించిన ప్రతి ఆర్టిస్ట్ నుండి సుకుమార్ పీక్స్ లెవెల్ పర్ఫామెన్స్ రాబట్టాడు. పుష్ప2తో సుకుమార్ వెయ్యి కోట్ల క్లబ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: