సంధ్య థియేటర్లో మహిళ మృతి... అసలేం జరిగింది.. మృతిరాలి భర్త మాటల్లోనే...!
ఊహించిన విధంగా పుష్ప 2 విడుదల సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. అసలు ఇరుకైన ప్రాంతం కావడంతో పాటు జాతీయ స్థాయిలో తిరుగులేని క్రేజ్ వల్ల పుష్ప 2 సినిమాలో నటించిన హీరో అల్లు అర్జున్ స్వయంగా అక్కడ షో చూసేందుకు రావడంతో ఎక్కువ మంది ప్రేక్షకులకు వచ్చారు. చివరకు అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ తొక్కిస లాటలో 39 ఏళ్ల రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కొడుకు ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అసలు ఆ రోజు రాత్రి సంధ్య థియేటర్ దగ్గర ఏం జరిగింది ? ఎందుకు తొక్కిసలాట జరిగింది ? అనే విషయాన్ని మృతురాల భర్త భాస్కర్ స్వయంగా వెల్లడించారు. మేము థియేటర్లో ఉన్నాం .. సరిగ్గా అప్పుడే అల్లు అర్జున్ వచ్చాడు .. ఒక్కసారిగా పబ్లిక్ రావడంతో అంత జామ్ అయిపోయింది .. నేను పాప పక్కన ఉన్న .. నా భార్య , బాబు కొంచెం ముందుకు వెళ్లారని చెప్పాడు.
కాల్ చేస్తే ఎత్తారు .. తర్వాత పది నిమిషాలకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది.. ఇంతలో పాప ఏడుస్తుంది .. దగ్గరలో తెలిసిన వాళ్ళు ఉంటే పాపను అక్కడ పెట్టి వచ్చాను అంతలోనే ఏదో జరిగిందని అంతా మాట్లాడుతున్నారు .. పోలీసు వాళ్ళు ఓ వీడియో చూపించారు .. అది మా బాబుదే .. వెంటనే జీపులో ఎక్కించుకొని హాస్పిటల్ కు తీసుకువెళ్లారు .. తర్వాత నన్ను పోలీస్ స్టేషన్కు రమ్మని చెప్పినట్టు మృతురాలు భర్త భాస్కర్ తెలిపారు. నా భార్యకు ఏమైంది అని అడిగాను అని ఏం చెప్పలేదు .. ఆ తర్వాత నిమ్స్ కు రమ్మని కాల్ చేశారు .. బాబును వెంటిలేటర్ పై పెట్టినట్టు తెలిపారు. 48 గంటలు గడిచి తప్ప ఏమి చెప్పలేమన్నారని .. అప్పుడే ఫోన్ వచ్చింది నా భార్య చనిపోయింది .. గాంధీ హాస్పిటల్ కు రమ్మన్నారని మృతురాలి రేవతి భర్త బోరున విలపిస్తూ చెప్పారు. ఇలా ఆ రోజు రాత్రి సంథ్య ధియేటర్ దగ్గర జరిగిన విషయాన్ని ఆయన వెల్లడించారు. భాస్కర్ కొడుకు అల్లు అర్జున్ అభిమాని .. బాబు కోసమే కుటుంబంతో కలిసి సినిమాకు వచ్చామని .. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు భాస్కర్.