నా బాడీ నా ఇష్టం.. ట్రోలర్లకు దిమ్మతిరిగేలా చెప్పిన టాలీవుడ్ సింగర్..!
ఇక ఆ సింగర్ ఎవరో కాదు ఆమె దామని భట్ల.. ఈమె రూపమే కాదు ఈమె పాడిన పాటలు కూడా చాలా మధురమైనవిగా ఉంటాయి.. ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రంలోని పచ్చబొట్టేసిన అనే పాట ఎంత పాపులారిటీ సంపాదించుకున్నది.. ఈ పాట వల్ల ఆమె చాలా ఫేమస్ అయ్యింది.. దామని ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన పాటలలో కూడా అలరించింది.. అందంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నదామని పాడుతా తీయగా సరిగమ లిటిల్ ఛాన్స్ వంటి షోలలో కూడా కనిపించింది.
సింగర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న దామని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాలపైన తెలియజేసింది.. అలాగే బిగ్ బాస్ హౌస్ లో తన అనుభవాలను కూడా పంచుకుంది.. వీటితో పాటు తనపై వచ్చిన ట్రోల్స్ గురించి మాట్లాడుతూ.. నా బాడీ నా ఇష్టం నా బట్టలు నా ఇష్టం నేను ఇలానే ఉంటానని నేను ఎలా ఉన్నా కామెంట్స్ చేసే వారు చేస్తూనే ఉంటారని వాటన్నిటిని మనం పాజిటివ్ గానే చూడాలని తెలిపింది.. అలాంటి వాటన్నిటిని అసలు పట్టించుకోకపోవడం బెటర్ అని కూడా వెల్లడించింది ఈ టాలీవుడ్ సింగర్.. మొత్తానికి తన పైన వచ్చిన ట్రోలర్స్ కి సైతం తాను ఏవిధంగా భయపడేది లేదని కూడా తెలియజేసినట్లు కనిపిస్తుంది.