మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి కియార అద్వానీ హీరోయిన్గా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ లో నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనిపించనుండగా ... అంజలి , శ్రీకాంత్ , సునీల్ , నవీన్ చంద్ర , జయరాం ఏ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు.
ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని దేశాల్లో ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్లు కూడా ఇప్పటికే ఓపెన్ అయినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి సంబంధించిన టికెట్ బుకింగ్లు తాజాగా యూకే ఓపెన్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ యూకే లో అదిరిపోయే రేంజ్ లో స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది.
ఈ మూవీ టికెట్ బుకింగ్స్ యూకే లో ఓపెన్ అయిన తక్కువ సమయం లోనే 1500 టికెట్ సేల్స్ జరిగినట్లు తెలుస్తోంది. అలా యూకే దేశంలో గేమ్ చేంజర్ మూవీ అదిరిపోయే రేంజ్ స్టార్ట్ ను అందుకున్నట్లు సమాచారం. ఇకపోతే ప్రస్తుతానికి ఈ సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకొని ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.