మహేష్ తో మరదలకి అంత గొడవ జరిగిందా... అందుకే సినిమాలకు దూరమైందా..?
ప్రస్తుతం శిల్పా శిర్కోద్కర్ పేరు వైరల్ అవ్వడంతో అంతా మహేష్ మరదలు అంటూ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. బిగ్ బాస్ సీజన్ 18 సందర్భంగాా సిస్టర్ నమ్రత శిరోద్కర్ తో తనకు ఎంతో బాండింగ్ ఉండనేది గుర్తుచేసుకుంది. రీసెంట్గా బిగ్ బాస్ హౌస్ కి అనురాగ్ కశ్యప్ వచ్చినప్పుడు శిల్పా శిర్కోద్కర్కి ఓ విచిత్రమైన ప్రశ్న ఎదురయ్యింది. దౌత్యవేత్త అనే ట్యాగ్ ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. దానికి ఆమె పోటీదారులు ఎవరూ తన కుటుంబం కాదని ... హౌస్ లో అందరూ తను ఇష్టపడే అమ్మాయినని .. చిన్న పిల్లని అంటుంది. అదే సమయంలో ఆమె ఈ ప్రశ్నకు తన లైఫ్ లో తన సిస్టర్ కు మధ్య గొడవ జరిగిందని అందుకే నమ్రతతో సరిగ్గా మాట్లాడటం లేదని ఆమె వ్యాఖ్యానించింది.
1990 దశకంలో బాలీవుడ్‌లో గ్లామర్ క్వీన్‌గా పేరుతెచ్చుకున్నది శిల్పా శిరోద్కర్. అంఖే , గోపీకిషన్ , బందీష్ , మృత్య్‌దండ్ , హమ్ , త్రినేతతో పాటు హిందీలో వంద వరకు సినిమాలు చేసింది. ఎక్కువగా గ్లామర్ పాత్రల్లోనే కనిపించింది. 2000 సంవత్సరంలో వచ్చిన గజగామిని తర్వాత బాలీవుడ్‌కు దూరమైంది. వరుస పరాజయాలతో ఆమె కెరీర్ ముగిసింది. ఆ తర్వాత కొన్ని టీవీ సీరియల్స్ చేసింది. మోహన్‌బాబు హీరోగా నటించిన బ్రహ్మ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. నాగార్జునతో హిందీలో ఖుదాగవా సినిమాలోనూ నటించింది. ఈ సినిమా తెలుగులోకి కొండవీటి సింహాం పేరుతో డబ్ అయ్యింది.