ప్రశాంత్ వర్మ వైపే వేళ్లు..చేయని తప్పుకు ఆయనపై ఆరోపణలు వస్తున్నాయా?

Reddy P Rajasekhar
హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. హనుమాన్ సక్సెస్ ఒక విధంగా ప్రశాంత్ వర్మ కెరీర్ కు ప్లస్ కాగా మరో విధంగా ప్రశాంత్ వర్మ కెరీర్ కు మైనస్ అయింది. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ కోసం బాలయ్య ఎంతోమంది దర్శకుల పేర్లను పరిశీలించి చివరకు ప్రశాంత్ వర్మ పేరును ఫైనల్ చేశారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా పూజా కార్యక్రమం ఆగిపోయింది.
 
మోక్షజ్ఞకు ఆరోగ్యం బాలేదని ప్రచారం జరుగుతున్నా అసలు కారణాలు వేరే ఉన్నాయని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కాల్సిన కొన్ని సినిమాలు సైతం ఆగిపోయాయని ప్రచారం జరుగుతుండటం గమనార్హం. ప్రశాంత్ వర్మపై హనుమాన్ తర్వాత పాజిటివిటీ కంటే నెగిటివిటీ పెరుగుతుండటం గమనార్హం.
 
ప్రశాంత్ వర్మ తనపై వస్తున్న కొన్ని విమర్శలు, గాసిప్స్ గురించి ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది. మైత్రీ బ్యానర్ లో ప్రశాంత్ వర్మ సినిమా క్యాన్సిల్ అయింది. ప్రశాంత్ వర్మ భవిష్యత్తు సినిమాలకు ఇబ్బందులు ఎదురైతే మాత్రం ఈ డైరెక్టర్ కెరీర్ పై కూడా ప్రభావం పడే ఛాన్స్ ఉంది. దేవకీ నందన వాసుదేవ రిజల్ట్ కూడా ప్రశాంత్ వర్మపై నెగిటివ్ ప్రభావం చూపడం గమనార్హం.
 
ప్రశాంత్ వర్మ రెమ్యునరేషన్ ప్రస్తుతం 20 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. ప్రశాంత్ వర్మ సక్సెస్ రేట్ రాబోయే రోజుల్లో పెరుగుతుందో తగ్గుతుందో చూడాల్సి ఉంది. ప్రశాంత్ వర్మ జై హనుమాన్ ఎప్పుడు థియేటర్లలో విడుదలవుతుందో క్లారిటీ లేదు. ఒకే సమయంలో ప్రశాంత్ వర్మ ఎక్కువ ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టడం విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దర్శకుడు ప్రశాంత్ వర్మ కెరీర్ ను ఒకింత జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: