పుష్ప-2 : ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే?
భారీ అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చేసింది ఈ మూవీ. అయితే ఇక పెద్ద సినిమా విడుదలైందంటే థియేటర్ల వద్ద ఉండే హడావిడి అంతా కాదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చాలామంది ప్రేక్షకులు ఇక థియేటర్ల వద్ద ఉండే హడావిడి కి భయపడి థియేటర్‌కు వెళ్లి సినిమా చూడడానికి కాస్త వెనకడుగు వేస్తూ ఉంటారు. ఇక ఇటీవలే ప్రీమియర్ షో కి వెళ్ళిన ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో చాలా మంది ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లాలంటే భయపడిపోతున్నారు. ఈ క్రమంలోనే థియేటర్ కు వెళ్లడానికి భయపడేవారు ఓటీటిలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే వేచి చూస్తూ ఉంటారు.
ఓటీడీలో రిలీజ్ అయిన వెంటనే సినిమాను చూసేయాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. దీంతో పుష్ప సినిమా ఓటిటి రిలీజ్ ఎప్పుడు ఉంటుందా అని అభిమానులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే ఈ మూవీ ఓటిటి రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది అనేది తెలుస్తుంది. ఇందుకోసం దాదాపు 250 కోట్ల రూపాయలు వచ్చినట్లు సమాచారం. అయితే ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడంతో సంక్రాంతి తర్వాతే ఈ సినిమా ఓటీటిలోకి వచ్చే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. వీలైనంత ఎక్కువ రోజులు థియేట్రికల్ రన్ కొనసాగించాలని చిత్ర బృందం ఫిక్స్ అయినట్లు మూవీ వర్గాలు చెబుతున్నాయి.