పుష్ప-2 : జాతర సీక్వెన్స్ తొలగింపు.. షాక్ లో అభిమానులు?
అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోఇజం ఎలివేషన్స్ సీన్స్ అయితే అభిమానులందరికీ కూడా గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి అని చెప్పాలి. అల్లు అర్జున్ను మును పెన్నడూ లేనివిధంగా సరికొత్తగా ఎలివేట్ చేసి చూపించాడు సుకుమార్ మరి ముఖ్యంగా గంగమ్మ జాతర సీన్ లో అల్లు అర్జున్ అమ్మ వారి గెటప్ వేసి విలయతాండవం చేయడం అయితే అభిమానులందరికీ కూడా రోమాలు నిక్కబడుచుకునేలా చేసింది. ఈ సీన్ వస్తున్న సమయంలో విజిల్స్ చప్పట్లతో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి.
అయితే ఇక అటు గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్ పుష్ప 2 సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంది అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కానీ ఒక్కచోట మాత్రం ఈ జాతర సీక్వెన్స్ లేకుండానే పుష్పా సినిమా ప్రదర్శితమవుతూ ఉందట. ఈ విషయం తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు. సౌదీ అరేబియా సెన్సార్ బోర్డు పుష్ప 2 సినిమాకు షాక్ ఇచ్చింది. ఇందులో 19 నిమిషాల జాతర ఎపిసోడ్ను తొలగించినట్లు అక్కడి నేషనల్ మీడియా వెల్లడించింది. బన్నీ అమ్మ వారి గెటప్ హిందూ దేవతల గురించి ప్రస్తావించడం పై అభ్యంతరం వ్యక్తం చేసింది సౌదీ అరేబియా సెన్సార్ బోర్డు. దీంతో మూడు గంటల ఒక నిమిషం నిడివి తోనే అక్కడ చిత్రం ప్రదర్శితమవుతున్నట్లు పేర్కొంది. కాగా సింగం అగైన్ బుల్ బులయ్య త్రీ చిత్రాలను కూడా ఆ దేశ సెన్సార్ బోర్డు బ్యాన్ చేసింది అన్న విషయం తెలిసిందే.