షాక్: మహేష్ మరదలితో వైఫ్ గొడవలా..?

Divya
బిగ్ బాస్ -18 సీజన్లో మహేష్ బాబు మరదలు  శిల్పా శిరోద్కర్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.. అయితే హిందీ బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చిన ఈమె హిందీ సినిమాలలో కూడా నటించింది. అయితే ఈమధ్య హిందీ సినిమాలకు కూడా దూరమైంది ఈ అమ్మడు. శిల్పా శిరోద్కర్ ఎవరో కాదు స్వయాన నమ్రత శిరోద్కర్ కి సిస్టర్ అవుతుంది. అప్పుడప్పుడు నమ్రత ఇంటికి కూడా హైదరాబాద్ కి వస్తూ పలు రకాల పార్టీలలో కనిపిస్తూ ఉంటుంది శిల్పా శిరోద్కర్. అయితే ఈమధ్య కాలంలో ఈమె సోషల్ మీడియాలో కూడా పెద్దగా కనిపించడం లేదు.

కానీ హిందీ బిగ్ బాస్-18 సీజన్లో కనిపించడంతో ఈమె పేరు మరొకసారి తెరమీదకి వచ్చింది. నమ్రత టాలీవుడ్ హీరో మహేష్ బాబు ని 2005లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే శిల్పా శిరోద్కర్ మాత్రం 2000 సంవత్సరంలోనే ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. తాజాగా శిల్పా శిరోద్కర్ పేరు మహేష్ మరదలు అంటూ ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకుంది.. అలాగే తన సిస్టర్ నమ్రతతో ఉన్న బాండింగ్ గురించి బిగ్ బాస్ హౌస్ లో తెలియజేయడం జరిగింది.. ముఖ్యంగా అక్కడ తనకు ఒక విచిత్రమైన ప్రశ్న కూడా ఎదురయింది. తనని దౌత్య వేత్త అనే ట్యాగ్ ఎందుకు వచ్చిందని విషయం పైన ప్రశ్నించగా..

ఆమె మాట్లాడుతూ హౌస్ లో అందరూ ఇష్టపడే అమ్మాయిని చిన్నపిల్లల నుండి తెలియజేసింది..అలాగే నమ్రత గురించి తెలియజేస్తూ బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు తాను నమ్రతతో గొడవ పడ్డాను అంటూ తెలియజేసింది.. కానీ తాను ఎందుకు గొడవపడ్డాను అనే విషయంపై మాత్రం తెలుపలేదు. ఇలాంటి విషయాలైనా సరే తన సిస్టర్ తో పంచుకోవడానికి ఇబ్బంది పడనని తెలియజేసింది..మోహన్ బాబు హీరోగా వచ్చిన బ్రహ్మ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఈమె ఆ తర్వాత మరే తెలుగు చిత్రం  చిత్రంలో కూడా నటించలేదట.. చివరిగా ఈమె 2000 సంవత్సరంలో గజగామిని సినిమాలో నటించి ఇండస్ట్రీకి దూరమైందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: