పుష్ప 2 తర్వాత అలాంటి హిట్ బన్నీ ఖాతాలో పడాలి అంటే కచ్చితంగా ఆ డైరెక్టర్ తో సినిమా చేయాల్సిందే..తప్పదు..!
అఫ్ కోర్స్ ఈ సినిమా హిట్ అవ్వాడానికి బన్నీ ఎంత కారణమో.. డైరెక్టర్ సుకుమార్ హీరోయిన్ రష్మిక మందన్నా కూడా అంతే కారణం అంటూ అంతా మాట్లాడుతున్నారు. అయితే పుష్ప 2 తర్వాత బన్నీ ఖాతాలో మళ్ళీ ఇలాంటి ఒక క్రేజీ హిట్ పడాలి అంటే చాలా చాలా కష్టమైన విషయమే . అసలు బన్నీ కూడా అలాంటి హిట్ పడుతుందని ఊహించలేడు . అంతలా పుష్ప2 సినిమాలో తన మార్క్ ను మించేసాడు బన్ని. అయితే కొందరు జనాలు మాత్రం బన్నీ ఖాతాలో మళ్లీ ఇలాంటి ఒక మాస్ హిట్ పడాలి అంటే కచ్చితంగా టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం లో నటిస్తే ఆ లోటు తీరిపోతుంది అంటున్నారు.
అఫ్కోర్స్ జనాల ఒపీనియన్ కూడా కరెక్టే . సందీప్ రెడ్డి వంగ ఐదు సంవత్సరాలకు ఒక సినిమాను తెరకెక్కించిన చాలా రియలిస్టిక్ గా చాలా హుందాగా తెరకెక్కిస్తాడు. అఫ్ కోర్స్ నిజాన్ని పచ్చిగా చూపించే విధంగానే తెరకెక్కిస్తాడు. బన్నీ కూడా అంతే నాటీనెస్ ని నిజాన్ని నిజంగానే ప్రత్యేకంగా చూపిస్తాడు . అందుకే వీళ్ళిద్దరి కాంబోలో ఒక సినిమా వస్తే అదిరిపోతుంది అంటున్నారు జనాలు. చూద్దాం మరి ఆ టైం ఎప్పుడు వస్తుందో ..? ప్రెసెంట్ అయితే బన్నీ పుష్ప2హిట్ ని ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్, మరీ ముఖ్యంగా ఒక బడా హీరో ఫ్యాన్స్ పుష్ప 2 ఫ్లాప్ కావాలని బాగా కోరుకున్నారు. అయినా సరే బన్నీ నటించిన పుష్ప 2 సినిమా హిట్ అవ్వడంతో జనాలు పొగిడేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు దీనికి సంబంధించిన వార్తలు వైరల్ గా మారాయి..!