పుష్పగాడి క్రేజ్ కి మెగా ఫ్యామిలీ తలవంచాల్సిందేనా.?

Pandrala Sravanthi
 పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్ అంటూ పుష్ప పార్ట్ వన్ విడుదలైనప్పటి నుండి ఇప్పటివరకు ఇదే డైలాగ్ కంటిన్యూ అవుతుంది  అంతేకాదు ఈ సినిమాతో అల్లు అర్జున్ రాజమౌళి వంటి పాన్ ఇండియా దర్శకుడు లేకుండానే పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. తగ్గేదేలే అంటూ చిన్న నుండి పెద్ద వరకు ప్రతి ఒక్కరు నోళ్లలో నుండి అల్లు అర్జున్ డైలాగ్ వచ్చేది.అలా తాజాగా విడుదలైన పుష్ప-2  సినిమా మరింత అద్భుతంగా ఉంది.ఈ సినిమా చూసి వచ్చిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు టికెట్ డబ్బులు పోయినా కూడా సినిమా అద్భుతంగా ఉంది. సినిమా చూసిన ఫీలింగ్ బాగుంది అని పొగుడుతున్నారు. అయితే చాలా రోజుల నుండి మెగా ఫ్యామిలీ నుండి అల్లు అర్జున్ ని వెలివేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఎక్కడో ఓ దగ్గర వీరి మధ్య అలాంటిదేమీ లేదు అని తెలిసినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం వీరి గురించే రచ్చ జరుగుతుంది. 

ఇక తాజాగా విడుదలైన పుష్ప-2  సినిమా విడుదలకు ముందు ఎన్నో అడ్డంకులు వచ్చాయి. బన్నీ వెళ్లి చిరంజీవికి క్షమాపణలు చెప్పాలని,లేపోతే సినిమా అడ్డుకుంటాం అంటూ కొంతమంది నేతలు బయటికి వచ్చి చెప్పారు.కానీ తాజాగా విడుదలైన పుష్ప -2 సినిమా చూస్తే మాత్రం మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ కి తలవంచాల్సిందే అంటున్నారు అల్లు ఫ్యాన్స్.ఎందుకంటే ఇన్ని రోజులు మెగా ఫ్యాన్స్ మాత్రమే అల్లు అర్జున్ ని కాపాడినట్టు మెగా ఫ్యాన్స్ విర్రవీగిపోయి అల్లు అర్జున్ పై కామెంట్ల మోత మోగించారు. కానీ తాజాగా పుష్ప-2 సినిమాతో అల్లు అర్జున్ ప్రతి ఒక్క హీరో అభిమాని మనసు దోచారు. మెగా ఫ్యాన్స్ రాకున్నా సపోర్ట్ చేయకపోయినా సినిమాకి వచ్చిన నష్టమేమీ లేదు.
 అంతేకాదు ఇప్పటివరకు మెగా ఫ్యామిలీకి సంబంధించి సాయి దుర్గ తేజ్ తప్ప మిగిలిన ఎవరూ కూడా బన్నీకి సపోర్ట్ ఇవ్వకపోవడంతో సోషల్ మీడియాలో కూడా మెగా ఫ్యామిలీ నెగిటివిటీ ఎదుర్కొంటుంది.

వైసిపి ఫ్రెండ్ తరఫున ప్రచారం చేయడానికి వెళ్తేనే బన్నీ ని అంత నెగిటివ్ చేస్తే గతంలో జనసేన పార్టీకి  అల్లు అర్జున్ వీరాళాలు ఇచ్చారు.అలాగే నాగబాబుకి కూడా ఎన్నో సినిమాల్లో నిర్మాతగా అవకాశాలు ఇచ్చి ఎంతో హెల్ప్ చేశాడు అప్పుడు గుర్తుకు రాలేదా ఒక్కసారి ఫ్రెండ్ కోసం వెళితే మరీ ఇంత నెగిటివ్గా చేయాలా అని మెగా ఫ్యామిలీ పైన ట్రోల్స్ వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ అల్లు అర్జున్ తన నటనతో  పుష్ప-2 సినిమాతో హిట్ కొట్టేసాడు.ఇక ఈయనకు వచ్చిన క్రేజ్ దృష్ట్యా మెగా ఫ్యామిలీ ఈయనకు తలవంచాల్సిందే అంటున్నారు క్రిటిక్స్. ఎందుకంటే ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోయినా కూడా తనకి తానే స్వయంగా ప్రమోషన్స్ చేసుకొని సినిమాపై మరింత హైప్ తీసుకోవచ్చాడు. అలా సింగల్ హ్యాండ్ తో బాక్సాఫీస్ ని షేక్ చేసిన అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీ కచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే అంటున్నారు. మరి చూడాలి బన్నీ పుష్ప-2 సినిమాని చూసైనా మెగా ఫ్యామిలీ తగ్గి ఆయనకు సపోర్ట్ చేస్తుందో లేక అలాగే కోల్డ్ వార్ కొనసాగిస్తుందా అనేది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: