షాక్: లేడీ డైరెక్టర్ తో.. శివ కార్తికేయన్ వివాదం.. కారణం..?
ఈ చిత్రానికి పురనానూర్ అనే టైటిల్ని కూడా ఫిక్స్ చేశారట. అయితే ఈ సినిమా షూటింగ్ వచ్చేయేడాది జనవరిలో మొదలు పెట్టడానికి పలు రకాల సలహాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఇందులో భాగంగా నిన్నటి రోజున ఈ సినిమా ప్రోమో షూట్ చేయడానికి చిత్ర బృందం సిద్ధం కాగా.. కానీ డైరెక్టర్ సుధా కొంగర, హీరో శివ కార్తికేయన్ మధ్య విభేదాలు తలెత్తడంతో ప్రోమో షూట్ రద్దు చేసినట్లు సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే వైరల్ గా మారుతోంది.
ముఖ్యంగా ప్రోమో షూట్ కి హీరో శివ కార్తికేయన్ పూర్తి గడ్డంతో రావడం వల్ల ఆమె అభ్యంతరాన్ని తెలియజేసిందట.. గడ్డాన్ని తొలగించాలని డైరెక్టర్ సుధా కొంగర చెప్పడంతో వారి మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చాయని సమాచారం.. అయితే కథ చెప్పినప్పుడే గడ్డంతోనే ఉండాలని చెప్పారు కదా అంటూ శివ కార్తికేయన్ కూడా కాస్త అసహనాన్ని తెలిపారుట.. అయితే కేవలం లైట్ బియర్డ్ తో ఉంటే చాలని చెప్పినప్పటికీ.. పూర్తి గడ్డంతో వస్తే ఎలా అంటే దర్శకురాలు అనడంతో తన అభ్యంతరాన్ని తెలిపి షూటింగ్ శివ కార్తికేయన్ వెళ్ళిపోయారని టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉన్నది తెలియాల్సి ఉన్నది.