పుష్ప 2: తొలి రోజు 250 కోట్లు..బన్నీ రికార్డు.. ఆర్ఆర్ఆర్, బాహుబలి రికార్డ్స్ బ్రేక్‌?

Veldandi Saikiran
టాలీవుడ్‌ స్టార్ హీరో అల్లు అర్జున్ తాజాగా చేసిన సినిమా పుష్ప 2 అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా చేయగా... హీరోయిన్ల రష్మిక మందాన నటించి మెప్పిస్తున్నారు.పుష్ప మొదటి భాగంలోనే ఈ జంట...ఊర మాస్ యాక్టింగ్ తో అదరగొట్టింది. ఇక ఈ పుష్ప రెండో పార్ట్ లో అల్లు అర్జున్ అలాగే రష్మిక మందాన ఇరగదీసారట. అయితే ఈ సినిమా నిన్న రాత్రి నుంచి.. థియేటర్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.
 
ఇలాంటి నేపథ్యంలో ఈ పుష్ప రెండవ పార్టు.. అడ్వాన్స్ బుకింగ్ మొదటి రోజు 125 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందట. కేవలం మన భారతదేశంలో ఈ పుష్ప రెండవ పార్ట్‌ సినిమా 73 కోట్ల గ్రాస్ టికెట్లను... విక్రయించినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇక ఒక అమెరికాలో 35 కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయట. ఇలా మొత్తం 125 కోట్ల వసూలు రాబట్టిందట పుష్ప 2. అంటే దాదాపు 31 లక్షల 76,479 టిక్కెట్లు ఇండియాలో... విక్రయాలు జరిగాయి.
 
ఈ లెక్కన ఒక్క రోజు కలెక్షన్లు 250 కోట్లకు పైగా దాటే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు సినిమా విశ్లేషకులు.  ఒకవేళ అదే జరిగితే.. ఇండస్ట్రీలోనే ఇంతటి స్థాయిలో కలెక్షన్లు రాబట్టిన సినిమాగా పుష్ప రికార్డులోకి ఎక్కుతుంది. గతంలో ఆర్ఆర్ఆర్ సినిమా ఒక్కరోజే 223 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే.
 ఇక ఆ తర్వాత బాహుబలి  సినిమా కూడా అదే స్థాయిలో ఒక లక్షల్లో రాబట్టింది.  బాహుబలికి ఒక్కరోజు 217 కోట్లు వచ్చాయి. ఇక ప్రభాస్ నటించిన కల్కి సినిమాకు ఒక్కరోజులోనే 175 కలెక్షన్లు రావడం జరిగింది. ఇక అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 కూడా ఒక్కరోజులో 250 కోట్లు సాధిస్తే... ఇండియాలోనే బిగ్గెస్ట్ మూవీగా... చరిత్ర పుటల్లోకి ఎక్కుతుంది. ప్రస్తుత లెక్కలు చూస్తుంటే...కచ్చితంగా పుష్ప రికార్డులు సృష్టించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: