రజినీకాంత్ రాసిన కథతో.. హిట్టుకొట్టిన టాలీవుడ్ హీరో.. ఎవరంటే?
అయితే ఇక్కడ ముఖ్యంగా వారి ఇరువురి స్నేహం గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి. రజనీ, మోహన్ బాబు స్నేహం గురించి అందరికీ తెలిసిందే. ఇక మోహన్ బాబు చేసిన సోలోగా హిట్ కొట్టిన సినిమా "రాయలసీమ రామన్న చౌదరి" గురించి అందరికీ తెలిసిందే. 2000 సంవత్సరంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో భారీ హిట్ అయ్యి మంచి వసూళ్లు కూడా అందుకుంది. అసలు ఆ సినిమా కథ కానీ, మోహన్ బాబు పాత్ర కానీ సినిమాలో నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా విషయంలో మోహన్ బాబు రీసెంట్‌గా ఒక ఊహించని విషయాన్ని జనాలతో షేర్ చేసుకున్నారు. అవును, ఈ చిత్రానికి సూపర్ స్టార్ రజినీకాంత్ కథ అందించారట. తాను రాసిన కథ, తన కోసం ఇచ్చిన కథ అంటూ మోహన్ బాబు క్రేజీ ట్విస్ట్ ఇచ్చారు.
ఇకపోతే సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో మోహన్‌బాబుకి ఉన్న స్నేహబంధం గురించి అందరికీ తెలిసిందే. మన తెలుగులో చాలా మంది మోహన్ బాబు అంటే కామెడీగా చూస్తారు గానీ, మోహన్ బాబు నెట్‌వర్క్ మాత్రం మామూలుగా ఉండదు. చాలా సార్లు రజినీకాంత్‌ని కూడా ఏకవచనంతో పిలిచినప్పుడు చాలామంది ఆయనపై కామెంట్స్ కూడా చేయడం జరిగింది. కానీ తర్వాత రజినీతో కలిసి క్లోజ్ ఉన్న పిక్ పోస్ట్ చేసి బాండింగ్ ఎంత బలంగా అనేది చూపించారు. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు.