పుష్ప 2 లో ఆ సీన్‌ కట్‌ చేసిన సుక్కు..షాక్‌ లో ఫ్యాన్స్‌?

Veldandi Saikiran
అల్లు అర్జున్ హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ పుష్ప 2. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి రిలీజ్ అయింది. వాసవంగ డిసెంబర్ 5 అంటే ఇవాళ ఉదయం రిలీజ్ కావాల్సి ఉండేది. కానీ.. సినిమాను ఒకరోజు ముందే రిలీజ్ చేశారు. అయితే ప్రసాద్ ఐమాక్స్ లో కాకుండా సంధ్య థియేటర్లో ఈ సినిమా మొదటి షో పడింది. దీంతో సంధ్య థియేటర్లో చాలా మంది టికెట్లు బుక్ చేసుకొని... సినిమాను తిలకించారు.

రెండు సంవత్సరాల తర్వాత ఈ సినిమా వచ్చిన నేపథ్యంలో..  ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద అల్లు అర్జున్ అభిమానులు.. రచ్చ చేశారు.  దీంతో తీవ్ర ఉద్రిక్తత అర్ధరాత్రి చోటుచేసుకుంది. అంతేకాదు రేవతి అనే మహిళ తొక్కిసలాటలో మరణించింది. ఈ సంఘటన ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. సోషల్ మీడియాలో.. ఈ సంఘటనపై దారుణంగా  కామెంట్స్ కూడా చేస్తున్నారు.

అల్లు అర్జున్... సంధ్య థియేటర్ కు వెళ్లడంతోనే ఈ సంఘటన జరిగినట్లు చెబుతున్నారు. అయితే దీనిపై అల్లు అర్జున్ పై కేసు కూడా పెట్టారు.  అతన్ని వెంటనే అరెస్టు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక సినిమా విషయానికి వస్తే... ఈ సినిమాలో ఒక సీన్ లేపేసాడట దర్శకుడు సుకుమార్. ట్రైలర్ లో సముద్రంలో ఉన్న... ఒక సీనును కట్ చేశారట.
సముద్రంలో అల్లు అర్జున్ నిలబడి ఉన్న... ఒక సీన్ ట్రైలర్ లో కనిపించింది. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత దీన్ని లేపేసినట్లు చెబుతున్నారు. అయితే ఇది ట్రిమ్మింగ్లో  వెళ్లినట్లు అంటున్నారు. కాగా సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఈ సినిమాపై పాజిటివ్ టాక్ రావడంతో జనాలు... సినిమా చూసి ఎందుకు థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. ఒక రోజే 300 కోట్లకు పైగా వసూలు రాబట్టే ఛాన్స్ కూడా ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: