ఎన్టీఆర్ నుంచి అల్లు అర్జున్ వరకు.. స్టార్ హీరోల ఫస్ట్ రెమ్యూనరేషన్ ఇదే..?
త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ను తెచ్చుకున్న ఎన్టీఆర్ - రామ్ చరణ్ .. నందమూరి నట వారసత్వంతో సినిమాలు మొదలు పెట్టిన ఎన్టీఆర్ ఆ తర్వాత సొంతంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు .. ప్రస్తుతం 80 నుంచి 100 కోట్ల వరకు ఆయన రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు ..
అయితే ఎన్టీఆర్ మొదటి సినిమా అయిన నిన్ను చూడాలని కోసం ఐదు లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నారట. మెగా వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్ చరణ్ , చిరంజీవి కొడుకుగా చిరుత సినిమాతో తనదైన స్టైల్ లో నటించాడు. తొలి సినిమాతోనే బంపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా కోసం రామ్ చరణ్ 50 లక్షలు వరకు రెమ్యునరేషన్ అందుకున్నారట. ప్రస్తుతం 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు ఈ మెగాా హీరో. పాన్ ఇండియా హీరోగా ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ .. కోట్లకు పడకలెత్తిన ఈ స్టార్ హీరో తన మొదటి సినిమా ఈశ్వర్ కోసం 15 లక్షలు రెమ్యునరేషన్ అందుకున్నారట .. ప్రస్తుతం సినిమాకు 300 కోట్లకు వరకు అందుకుంటున్నాడు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కొడుకు గా మెగా కుటుంబం నుంచి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా తన సత్తా చాటాడు.. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో భారీ కలెక్షన్లు రాబట్టింది .. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన మొదటి సినిమా గంగోత్రి కోసం 20 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారట .. ఇక ఇప్పుడు ఒక్కో సినిమాకు దాదాపు 100 కోట్లకు వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అయితే పుష్ప2 కోసం ఏకంగా 300 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకున్నారు ఈ ఐకాన్ స్టార్..
మెగాస్టార్ చిరంజీవి కూడా తన తొలి సినిమాకి 1116 లు రెమ్యూనరేషన్ గా తీసుకున్నారట. ప్రస్తుతం చిరంజీవి తను చేసి ఒక్కో సినిమాకు 50 నుంచి 60 కోట్ల వరకు అందుకుంటున్నాడు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా ఎదిగి రాజకీయాల్లో కూడా నెంబర్ వన్ నాయకుడుగా దూసుకుపోతున్నాడు .. అయితే పవన్ తన తొలి మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాకు గాను ఐదు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారట. టాలీవుడ్ లో రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ నటించిన మొదటి సినిమా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ , నువ్వెలా వంటి సినిమాలకు అసలు రెమ్యూనరేషన్ తీసుకోలేదట. ఇక ఈ రౌడీ హీరో సినిమాల్లోకి రాకముందు ట్రోషన్లో చెప్పేవారట .. అందుకుగాను అతను కేవలం 500 రూపాయలు మాత్రమే తీసుకునేవాడని అది నా మొదటి రెమ్యూనరేషన్ అని ఆయన చెబుతూ ఉంటాడు .. ప్రస్తుతం ఈ రౌడీ హీరో సినిమాకు 50 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు .